21, సెప్టెంబర్ 2021, మంగళవారం

కవితా పుష్పాలు.


 పూయించు
మనసు కుండీలో
భావలతలకు
సంకల్ప జలంతో
కవితా పుష్పాలు.

Comment
Share

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వినాయక ఉవాచ..

 అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 


చేటంత చెవులు జేసి 

అన్నీ వినండి

కళ్ళు చిన్నవి జేసి

సూక్ష్మంగా పరిశీలించండి

అవసరమైన వరకే 

నోరు తెరవండి

వినాయక ఉవాచ...5, సెప్టెంబర్ 2021, ఆదివారం

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

2, సెప్టెంబర్ 2021, గురువారం

ష(షి)వరింగు

 చల్లగాలి వీస్తే

జలధరానికి ఒళ్ళు

జలదరింపు

దానికి "షివరింగు"

భూమికి "షవరింగు" 29, ఆగస్టు 2021, ఆదివారం

"బాస"ట

 అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.


బహు తీయనిది
మన "బాస"ట
మనుగడకు కోరుతోంది
మన "బాసట"


27, ఆగస్టు 2021, శుక్రవారం

"వే" లు

 

జీవించడానికి
ఎన్నెన్నో "వే" లు
ఎంచుకో ఎవరూ
ఎత్తిచూపకుండా "వేలు"


23, ఆగస్టు 2021, సోమవారం

22, ఆగస్టు 2021, ఆదివారం

"రాకీ" "వే" - "రావణ" పూర్ణిమ

 


నేడు సోదరుల చేతులు
అన్నీ రాకీవే
ఎదురు కాకూడదు
ఏ సోదరికీ "రాకీ" "వే"
కావాలి అన్ని రోజులు
శ్రావణ పూర్ణిమలు
రాకూడదు ఎప్పుడూ
"రావణ" పూర్ణిమలు.


17, ఆగస్టు 2021, మంగళవారం

లౌ "కిక్"

 

ఆశ్రమంలో భక్తులకు అలౌకికానందం ఆ శ్రమ తో స్వామీజీకి
లౌ "కిక్" ఆనందం.
13, ఆగస్టు 2021, శుక్రవారం

12, ఆగస్టు 2021, గురువారం

"స్పై" "డర్"

 

"నెట్" తో "సెల్"ధరులు
కొందరు "స్పైడర్"లు
కొందరు "స్పై" "డర్" లు
జాగ్రత్తగా ఉండాలి నరులు.


11, ఆగస్టు 2021, బుధవారం

8, ఆగస్టు 2021, ఆదివారం

3, ఆగస్టు 2021, మంగళవారం

మూడాచారాలు

 


మూఢాచారాలు కాదు మూడాచారా

లు

మూడోవేవుకు మూడాచారాలు
"ఒత్తిడిలేదు" గమనించి పాటించు
ఒత్తిడిలేక సుఖంగ జీవించు.


1, ఆగస్టు 2021, ఆదివారం

29, జులై 2021, గురువారం

గురువు


 నీలో ఉన్న
తెలివి అనే వత్తిని
కృషి అనే తైలాన్ని
కలిపి జ్యోతి లా వెలిగేట్లు
చేసేవాడు, గురువు.

"కావ" రమ్మని

 

భక్తులు భగవంతుణ్ణి
"కావ" రమ్మని అంటారు
వారిని కష్టపెట్టే వారికి
"కావరమ్మని" అంటారు.

ఫి(వి)ట్నెస్సు

 

ప్రతిదానికీ కావాలా
ఐ విట్నెస్సు?
ఈ కళ్ళకు లేదంత
హై ఫిట్నెస్సు.


24, జులై 2021, శనివారం

"విష్"యం

 

విషయం ఏంటంటే
విషయం గురించి
"విష"యంగా చెప్పేవారు కొందరు
"విష్"యంగా చెప్పేవారు కొందరు
"విషయం"గా చెప్పేవారు కొందరు


23, జులై 2021, శుక్రవారం

చిత్రం - మంత్రం.

 

వర్ణములు హెచ్చు తగ్గులలో స్రష్టల చేత కలుపుట - చిత్రం వర్ణములు హెచ్చు తగ్గులలో ద్రష్టల చేత పలుకుట - మంత్రం. 


20, జులై 2021, మంగళవారం

"నవ" నాడులు

 

నిరాశతో నిలబడితే
క్రుంగి పోతాయ్ నవనాడులు
ఆశతో పయనిస్తే
నవ్వుతూ ఎదురొస్తాయ్ "నవ" నాడులు.


16, జులై 2021, శుక్రవారం

ఆగడాలు


 

పెచ్చుమీరితే చీకటి ఆగడాలు
విచ్చుకుంటాయ్ వెలుగుల కాగడాలు
ఉండదు ఎక్కడా "ఆగడాలు"
కేవలం ముందుకు సాగడాలు.


13, జులై 2021, మంగళవారం

స్వా"గతిస్తారా?"


 "మాస్క్" తలుపు తెరచి
"మలిన" హస్తాలతో
మళ్ళీ "దాన్ని" పిలిచి
స్వా"గతిస్తారా?"


11, జులై 2021, ఆదివారం

"కేర్ కేర్"

 


తెల్లోడి భాషంటే మోజు
పిల్లోడికి కూడా
"కేర్ కేర్" మంటాడు
"కేర్" తీసుకోమంటూ.

10, జులై 2021, శనివారం

"గెస్ట్"

 

అనుకోని తిథిలో
వచ్చేవాడు "అతిథి"
గెస్ చేయని టైం లో
వచ్చేవాడు "గెస్ట్"


7, జులై 2021, బుధవారం

వాడనీ వీడనీ

 సమస్యల పై సమరానికి

ఉండకూడదు
వాడనీ, వీడనీ
ఎదురు చూపుల దైన్యం

ఉండవలసింది
వాడనీ వీడనీ
ఎదుర్కొనే ధైర్యం.


5, జులై 2021, సోమవారం

నిన్ దించడానికి

 


నిందించడానికి
వెనుకాడవు దైవాన్ని
నీకు వద్దన్నా పట్టదు

నిన్ దించడానికి
పాతాళంలోకి
విధికి నిమిషం పట్టదు.


28, జూన్ 2021, సోమవారం

కడుపులో "మంట"

 

కడుపులో "మంట" ఎక్కువై
బ్రతుకు "చితి"కి పోతున్నది
గుండె బాగా "బరు"వెక్కి
జీవితం "సమాధి" ఔతున్నది
కరోనా వల్ల "ఊపిరి సలపట్లేదు"
అని ఆక్రోశిస్తోంది స్మశానం.