26, డిసెంబర్ 2022, సోమవారం

కలరు


మంచి "తెలుపు" 

 "సూక్తి" కిరణాలను

"వక్రీ"భవనం చెందించి
"వర్ణ"ములుగా విడదీసి
చూపి "వర్ణిం"చు వారు
కొందరు "కలరు"
జాగ్రత్త "బ్రదరు".24, డిసెంబర్ 2022, శనివారం

అడుగు


మనిషి విజ్ఞానంలో
పై కడుగు బెట్టాడు
జ్ఞానంలోనే
అడుగు బట్టాడు.


23, డిసెంబర్ 2022, శుక్రవారం

పాత్ర

 జీవన నాటకరంగంలో

నీ పాత్ర అందరికీ
ఆదర్శ పాత్రమవాలి.

21, డిసెంబర్ 2022, బుధవారం

మోజింక

 

చెంగుచెంగున చెంగలి చేరకు 
చెడుతలపుల
ముంచెడు తల పులులు
వలపుల వల పులులు
ఉంటాయేమోజింకా!
తగ్గించుకో కాస్త నీ మోజింక.


20, డిసెంబర్ 2022, మంగళవారం

కూస్తే

 

కోయిలమ్మ
కూసే కాలం "కూస్తే"
రాసి కాదు
వాసిముఖ్యం
వినాలనుకుంటారు
ఒకసారి కూస్తే.

16, డిసెంబర్ 2022, శుక్రవారం

ఒక'ట్రెండు'

 

విఫలమైనా సరే
ఒకట్రెండు
నీదంటూ సృష్టించు
ఒక ట్రెండు.

🤘

15, డిసెంబర్ 2022, గురువారం

చిక్కులు

 

చిక్కులు 

అవే పోతాయ్

కేశాలను దువ్వితే

క్లేశాలలో నవ్వితే.


13, డిసెంబర్ 2022, మంగళవారం

ప్రే 'రేప్' ణ

 

కొన్ని సమయాల్లో
స్మార్ట్ ఫోన్
"ప్రే" లకు
"రేప్" లకు
ప్రేరేపణ.

11, డిసెంబర్ 2022, ఆదివారం

ఆగమనం

 

శిశిరమంటే 
ఎవరికి మోదం?
ఎవరమూ ఆగమనం
అందరికీ ఆమోదం
వసంత ఆగమనం.


10, డిసెంబర్ 2022, శనివారం

వ్ర(ఋ)ణం

సమాజానికి
తీర్చుకోవాలి ఋణం
చేయకు దానికి
మాయని వ్రణం.


4, డిసెంబర్ 2022, ఆదివారం

3, డిసెంబర్ 2022, శనివారం

నెత్తిమీదకి

 

పైకి ఎదిగావా
అందరి కళ్ళు నీ మీదకి
ఎక్కకుండా చూసుకో
నీ కళ్ళు నెత్తిమీదకి.


2, డిసెంబర్ 2022, శుక్రవారం

1, డిసెంబర్ 2022, గురువారం

కుర్చీ

 

తొలి దశలో
గోడ కుర్చీ
నడి దశలో
"వీల్" కుర్చీ
మలి దశలో
వాలు కుర్చీ.