28, ఫిబ్రవరి 2021, ఆదివారం

"పాలిచ్చే" వాళ్ళు

 

సంతానానికి, సమాజానికి
"పాలిచ్చే" వాళ్ళు ఇవ్వాలి
అడిగినవి, అడగనివి కాదు
వారికి అవసరమైనవి.


27, ఫిబ్రవరి 2021, శనివారం

మానవజన్మ

 

చిన్నతప్పుతో దేవతలకు
కొద్ది పుణ్యంతో మృగాలకు
మానవజన్మ...ఇప్పుడు ఎక్కువగా
మృగాలే పుణ్యం చేస్తున్నట్లున్నాయి.26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

దాగుడు "మూతలు"

 

దొంగ కరోనాకు
పడలేదు మూతలు ప్రస్తుతం ఆడుతోంది దాగుడు మూతలు వదలివేయకు జాగరూకతలు.

24, ఫిబ్రవరి 2021, బుధవారం

10, ఫిబ్రవరి 2021, బుధవారం

ADD అవకుండా

 

సీరియల్స్ ఉంటాయా
యాడ్స్ ADD అవకుండా
ప్రేక్షకులు ఉంటారా
చూస్తూ యాడవకుండా.


9, ఫిబ్రవరి 2021, మంగళవారం

8, ఫిబ్రవరి 2021, సోమవారం

"walk" స్వాతంత్ర్యం

 

"వాక్" స్వాతంత్ర్యం ఉందని
వాగకు ఘోరంగా
"walk" స్వాతంత్ర్యం ఉందని
సాగకు "go wrong" గా

5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

నే "నోటంటా"

 


నువ్వోటంటే నేనోటంటా - పోలిటిక్స్ నువ్ "ఓటంటే" నే "నోటంటా" - పోల్ ట్రిక్స్.

4, ఫిబ్రవరి 2021, గురువారం

"కల"రు


 నిద్రలో కూడా నిలబడకుండా
మనసు ఉరుకులు పరుగులు
చూపిస్తూ ఉంటుందిగా
"కల"రు షార్ట్ పిల్ములు.


3, ఫిబ్రవరి 2021, బుధవారం

"COW"లు

 

నిస్సారమౌతున్నాయ్
సమాజ వృక్ష మూలాలు
నేడవసరం "పాడి"యైన
"COW"లు లాంటి కవులు.