31, ఆగస్టు 2019, శనివారం

29, ఆగస్టు 2019, గురువారం

అడ్డుకట్ట

"పవర్" కావాలంటే 
అవసరమైన మేరకు
అడ్డుకట్టవుండాలి 
నోటికి,నీటికి.  

26, ఆగస్టు 2019, సోమవారం

అది కారం.

అవసరమైన వరకే
ఉపయోగించమంట
పులుముకుంటే మంట
అధికారం - అది కారం.

ఉండి పోరు

కార్యసాధకులు సమస్యలొస్తే
నిరాశతో ఉండిపోరు
లక్ష్యం చేరేదాకా చేస్తారు
ఎదురుగా ఉండి పోరు 

(ఏ )దోచెయ్యాలని

అనుకోకు నలుగురినీ
పుట్టినందుకే దోచెయ్యాలని
అనుకోవాలి నలుగురికీ
పుట్టినందు కేదోచెయ్యాలని.
21, ఆగస్టు 2019, బుధవారం

ర 'హాస్యాలు'

ఋషులు కథలలో దాచారు
ఖగోళ రహస్యాలు
అర్థం కానివారికి
కనబడేది హాస్యాలు.


19, ఆగస్టు 2019, సోమవారం

వరదా! వరదా!

ఇక్కడ పోతుంటే మునిగి 
ఎవరది? దేవుణ్ణి 
తెలుగులో ప్రార్థించేది 
వరదా! వరదా! అని?

తెలుగు వాడనీ!

విదేశంలో పుట్టినా 
మీ వాడిని తెలుగు వాడనీ!
ఎలుగెత్తి చాటాలిరా 
మా వాడు 'తెలుగువాడనీ'.

16, ఆగస్టు 2019, శుక్రవారం

చదువులమ్మ పూనటం

పాఠశాలల్లో తగ్గాలి
చదువు 'లమ్మబూనటం' 
విద్యార్థులకు పెరగాలి
'చదువులమ్మ' పూనటం.

నారి,చిన్నారి

అత్యాచారి ఔతున్నాడు హత్యాచారి
వాడికెవరైతేనేం నారి,చిన్నారి
'శిక్షఉరి' అన్నా మారటం లేదుమరి
ఎవరి జాగ్రత్త వారిదే ప్రతిసారి.


12, ఆగస్టు 2019, సోమవారం

రో 'గం జాయి'

జాగ్రత్త ....వాడు 
వాడుతాడురో 'గంజాయి'
అంటిస్తాడు
అంటు  రోగం.... 'జాయి '

9, ఆగస్టు 2019, శుక్రవారం

చల్లని "వారు".

కొందరు కలిసుంటారు
పైకి 'చల్లనివారు '
జరుగుతూ ఉంటుది
మధ్య చల్లని "వారు". 
...

కా 'వరము'.

తగ్గించుకోకుంటే
కండకావరము
దేవుడేయిచ్చినా
నిలుస్తుందా వరము.


7, ఆగస్టు 2019, బుధవారం

3, ఆగస్టు 2019, శనివారం

వీడి "యోగా"

అనుసరించండి
వీడి "యోగా"
అందిస్తున్నాడుగా
"వీడియోగా".


1, ఆగస్టు 2019, గురువారం

"సే" వ్వా!

సమాజ సేవ 
సాహిత్య సేవ 
చేస్తున్నవారికి
"సే" వ్వా!