19, మార్చి 2014, బుధవారం

' కడ ' తేరు.


శ్రీనివాసుడు ఆసీనుడై  ఉండగా        
భూనివాసులకు కనువిందు చేస్తూ
తిరుగుటకు  సిద్ధముగా నున్నది
తిరుమల దేవాలయము కడ తేరు.

ఏడుకొండల వాని  భజన చేస్తూ  
వేడుకగా వస్తున్న రథ యాత్రను
మాడ వీధులలో తిలకిస్తూ
వేడుకున్న వారి పాపాలు  కడతేరు.