27, ఫిబ్రవరి 2020, గురువారం

"పేనుబంక" తెగుళ్ళు.

పల్లెటూళ్ళ లోగిళ్ళు
చక్కని పూ పొదరిళ్ళు
కాని ఊరిముందరి రహ"దార్లు"
పట్టిఉంటాయి "పేనుబంక" తెగుళ్ళు.

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

"వార్" తలపెడతారు

సోషల్ మీడియా...మంచిదే
కొందరు "వార్తలు" పెడతారు
సోషల్ మీడియా...జాగ్రత్త
కొందరు "వార్" తలపెడతారు. 

21, ఫిబ్రవరి 2020, శుక్రవారం

బట్ట "లేనివాడు"

ఓం నమశ్శివాయ
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

"దిగంబరుడు" అంటే
కాడు బట్ట "లేనివాడు"
దిక్కులమధ్య "బట్టబయలై"
మనసున కంతు"బట్టలేని" వాడు.

.

17, ఫిబ్రవరి 2020, సోమవారం

'అప్పు' రూపం.

కొందరికి జీవితం
అపురూపం
మరికొందరికి
'అప్పు' రూపం.


3, ఫిబ్రవరి 2020, సోమవారం

"ఆన్" కరోనా

వస్తోంది
వై'రసుర' కరోనా
ఆపు చర్యలు
"ఆన్" కరోనా
లేకుంటే
ఆనక "రోనా".