30, సెప్టెంబర్ 2020, బుధవారం

"ఇల్"లరికం

 

పుట్టిల్లు తెలుగింటినుంచి
ఇంగ్లీషు "ఇన్"టికి ఇల్లరికం
కొందరికి "ఇల్"లరికం
కొందరికి "విల్"లరికం.


28, సెప్టెంబర్ 2020, సోమవారం

లావు - సన్న

 లావుగా ఉన్నవారు

తగ్గడానికి "సన్న"ద్ధమవటం 

సన్నగా ఉన్నవారు 

పెరగటానికి ఉవ్విళ్ళు "ఊర"టం.


27, సెప్టెంబర్ 2020, ఆదివారం

"వాక్" పటిమ

  

బాగా మాట్లాడగలితే
వాక్పటిమ
బాగా నడువగలిగితే
"వాక్" పటిమ.


23, సెప్టెంబర్ 2020, బుధవారం

'మాయ'రోగం.

  

మందుల కొట్టువద్ద
బారులు తీరి జనం
బారుల వద్ద
మందుకొట్టు జనం
కారణం 'మాయ'రోగం.

ఎద్దేవా"డు".

  

 పర మత గ్రంథాలను
"ఎద్దేవా" చేసే వాడు

బుద్ధిలేని "ఎద్దేవాడు".

19, సెప్టెంబర్ 2020, శనివారం

"పుష్ ద కాల్"

 

 నేడేరీ? "నిల్లు"
"పుస్తకాల పురుగులు"
ఇప్పుడంతా "సెల్లు"
"పుష్ ద కాల్" పురుగులు.


18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

RUM అంటే

 తెలుగు కోసం రమ్మంటే 

ఎవరికీ లెక్కలేదు

ఇంగ్లీషులో RUM అంటే

ఎందరో లెక్కలేదు. 

17, సెప్టెంబర్ 2020, గురువారం

"రేప్పెట్టే" పోజులు

  

 "అంద"క - దాచుకుంటేనే
దోచుకుపొయే రోజులు
ఎందుకు - ప్రదర్శిస్తూ
"రేప్పెట్టే" పోజులు?


13, సెప్టెంబర్ 2020, ఆదివారం

"పట్టని" వారు.

 

మహానుభావులు కొందరు
ఆకాశపు పీఠంపై పట్టని వారు
దేశానికి, సమాజానికి
ఏమాత్రం "పట్టని" వారు.

10, సెప్టెంబర్ 2020, గురువారం

"కారపు" రేట్లు.

 

విద్యాలయాలు
వైద్యాలయాలు
అయితే "కార్పొరేట్లు"
ఉంటాయి "కారపు" రేట్లు.

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

'లెక్క' జేయరేందీ

 'సైన్స్' తెలిసినవాళ్ళు

'సోషల్' డిస్టెన్స్ పాటించమని
'ఇంగ్లీషు' లో స్పీకినా
'తెలుగు' లో చెప్పినా
'లెక్క' జేయరేందీ ఈ జనం.


4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

చుక్కెదురైతే

 అవుతుంది మంచి శకునం

చిరునవ్వుల చుక్కెదురైతే
కలుగుతుంది నిరుత్సాహం
ప్రతి పనికి చుక్కెదురైతే
పెరుగుతుంది ఆనందం
మద్యప్రియునికి చుక్కెదురైతే.

3, సెప్టెంబర్ 2020, గురువారం

ఓ సబ్బూ!

 నీవు లేకుంటే ఓ సబ్బూ!

మాకు అంటుకునేది ఆ జబ్బు

మా జీవితమయ్యేదిగా గబ్బు

బహుత్ శుక్రియా బోల్తా హం సబ్బు.


1, సెప్టెంబర్ 2020, మంగళవారం

SOME 'గీ' త

 కవిగారి

చక్కని గీతాలకు

కావాలి సంగీతపు
మకుటాలు
కప్పకు SOME 'గీ' తపు
బురఖాలు.