26, సెప్టెంబర్ 2021, ఆదివారం

దోచేయడానికి

 


కొంతమంది పుట్టేదేదో చేయడానికి కొంతమంది పుట్టేదే, దోచేయడానికి.
21, సెప్టెంబర్ 2021, మంగళవారం

కవితా పుష్పాలు.


 పూయించు
మనసు కుండీలో
భావలతలకు
సంకల్ప జలంతో
కవితా పుష్పాలు.

Comment
Share

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వినాయక ఉవాచ..

 అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. 


చేటంత చెవులు జేసి 

అన్నీ వినండి

కళ్ళు చిన్నవి జేసి

సూక్ష్మంగా పరిశీలించండి

అవసరమైన వరకే 

నోరు తెరవండి

వినాయక ఉవాచ...5, సెప్టెంబర్ 2021, ఆదివారం

3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

"వెట్" చాకిరీ


 "వెట్" చాకిరీ
చేయలేక మేఘాలు
అవుతున్నాయి
కన్నీరు మున్నీరు.


2, సెప్టెంబర్ 2021, గురువారం

ష(షి)వరింగు

 చల్లగాలి వీస్తే

జలధరానికి ఒళ్ళు

జలదరింపు

దానికి "షివరింగు"

భూమికి "షవరింగు"