23, మార్చి 2023, గురువారం

దారి

 

విజయ సాధనకై
కొందరిది "టఫ్" దారి
కొందరిది "తప్పు" దారి


16, మార్చి 2023, గురువారం

"కపుల్"

 

చక్కగా 
సంసారం చేస్తే
గుడ్ "కపుల్"
తిక్కగా
గొడవలుపడుతుంటే
కూడు "కపులు"


15, మార్చి 2023, బుధవారం

"నై" "పుణ్యం"

 కాయాన్ని 

కాయగూరల్లా 

ముక్కలు చేసి

"ఫ్రిజ్" లో పెడుతున్నాడు

మనిషిలో పెరిగింది

"నై" "పుణ్యం"11, మార్చి 2023, శనివారం

"ఓటరు" భక్తుడు

"ఓటరు" ప్రజాస్వామ్య భక్తుడు

"తాయిల" ప్రసాదం తిని
"బ్యాలెట్ బాక్స్" హుండీలో
"ఓటు" కానుక వేస్తుంటాడు.


10, మార్చి 2023, శుక్రవారం

అడ్డ "గోల్"


"గోల్" కోసం

వెళ్ళే అడ్డదారి 

అడ్డ "గోల్"  దారి 

కాకుంటే సరి

అడ్డగోలు దారి. 


  


8, మార్చి 2023, బుధవారం

కలుపు మొక్క

 

తులసి వనంలో
గంజాయి కలుపు మొక్క
గంజాయి వనంలో
తులసి కలుపు మొక్క.


6, మార్చి 2023, సోమవారం

ఉండీ లేనట్టు

 బట్ట కట్టు, ఉండీ లేనట్టు పెట్టు బొట్టు, ఉండీ లేనట్టు కండ ఫిట్టు, ఉండీ లేనట్టు భాష పట్టు, ఉండీ లేనట్టు కొందరి తీరిట్టు, ఏమి చెప్పేట్టు?3, మార్చి 2023, శుక్రవారం

చి(చె)త్త శుద్ధి

చేయాలంటే చెత్త శుద్ధి
ఉండాలంటా చిత్త శుద్ధి
విని ఆచరిస్తే విత్త సిద్ధి
వినక వదిలేస్తే మొత్త బుద్ధి.