24, అక్టోబర్ 2012, బుధవారం

విజయద శమి.

బ్లాగు వీక్షకులకు విజయ దశమి శుభాకాంక్షలు.
దుర్గా మాతను
నవరాత్రులు
దిగ్విజయంగా
పూజించిన
తరువాతి రోజు
విజయ  దశమి

ఈ రోజు శమీ
వృక్షాన్ని
పూజిస్తే కలుగుతుంది
విజయం
అందుకే అది
విజయద  శమి.
 


10, జులై 2012, మంగళవారం

'ఆ' కులము

చిన్నబుచ్చుచూ 
అనబోకు ఎవరితో 
'నాది ఈ  కులము
నీది ఆ కులము'

సమాజమనే కొమ్మకు 
మనమంతా 
అందంగా అతికియున్న 
వరుస  ఆకులము.

16, జూన్ 2012, శనివారం

తిండి పడక


ఒక లక్ష్యాన్ని 
చేరాలనుకునే విద్యార్థి 
పట్టించుకోకూడదు
తిండి, పడక


అలా అని 
ఏదంటే అది తింటే
"నీరుగారి పోతాడు"
                                   తిండి   పడక . 

29, ఏప్రిల్ 2012, ఆదివారం

నీ కో 'వెల'


సర్వాంతర్యామీ!
 నీవు గుడిలోనే
ఉన్నావని భావిస్తే
దర్శనానికి
అక్కడిదాకా వెళ్ళి 
చెల్లించాలి
నీకో వెల

అనుకున్నదే తడవు
నీ ఉచిత దర్శనానికి
అనువుగా
 నా గుండెనే 
చేసుకోరాదా
నీ  కోవెల.

10, ఏప్రిల్ 2012, మంగళవారం

అమ్మా'యెందుకని'

అమ్మలూ...
కడుపునున్న గ్రుడ్డుపై 
మీకు దయలేదా? 
ఆడ శిశువును 
పుట్టకముందే 
పుట్టి ముంచుతున్నారు
అబ్బాయి చాలు 
అమ్మాయెందుకని


అమ్మలూ...
కడుపున  నున్న నీవైనా 
అమ్మను అడగలేవా?
నీవు కూడా ఆడదానివే కదా
నీ తల్లి నిన్ను కన్నది కదా  
నామీద కక్ష 
అమ్మా!  యెందుకని.

8, ఏప్రిల్ 2012, ఆదివారం

చిన్న బాల ' శిక్ష '

తెలుగు  నాట  నా డు   
బడులలో బుడుగులకు 
తెలుగు నాటు టకు                      
బోధించే వారు 
చిన్న బాల శిక్ష 
పెద్ద బాల శిక్ష 


తెలుగు నాట నేడు 
కాన్వెంటులలో టీచ(జ)ర్లు 
'నాట్ తెలుగు' అంటూ 
బాధిస్తూ వేస్తున్నారు 
చిన్న బాలలకు పెద్ద శిక్ష.

1, ఏప్రిల్ 2012, ఆదివారం

శ్రీ రామా ! నీ చరితం

శ్రీ రామా ! నీ చరితం 
సకలగుణ సా(గ)రం 
ఎవరేది వెతికితే 
అదే లభిస్తుంది.
దొరక లేదా 
ఒకరికి కల్పవృక్షం 
మరొకరికి విషవృక్షం
ఏదో ఒక రకంగా 
నీ కథా సాగరం లో 
మునక వేసిన వారికి
తప్పక ఇస్తావు మోక్షం. 

 
 


23, మార్చి 2012, శుక్రవారం

అభి'నందన'

ఈ నందన వత్సరమున 

ఆ నంద నందనుడు 
అందించు గాక
అందరకు ఆనందములు

ఆ నంది వాహనుడు 
అందించు గాక 
అందరకు శుభాశీస్సులు 

రావోయి ' నందన '
నీకు  అభినందన

19, మార్చి 2012, సోమవారం

' కాల్చే' స్తారు

నీవు వాహనం 
నడిపే టప్పుడు తెలియక 
తెలిసిన వారు 
నీ ' సెల్ ' కు
పాపం  ' కాల్చే' స్తారు

నీవు తెలిసి కూడా 
తెలియని వాడిలా 
నడుపుతూ మాట్లాడితే
వెళతావు ' హెల్ '  కు  
నిన్ను ' కాల్చేస్తారు '.

11, మార్చి 2012, ఆదివారం

తెలుగు 'వాడి' ని.

ఏ దేశ మేగినా 
ఎందు కాలిడినా 
చెప్పరా గర్వంగా ఇలా 
'నేను తెలుగు వాడిని'


ఏ  పనిచేసినా  
ఎవరితో కలిసున్నా 
ఎప్పుడూ అవబోకు'సున్నా'
చూపించు  తెలుగు 'వాడి' ని.


4, మార్చి 2012, ఆదివారం

'ముక్కు' తాడు

బద్దకస్తు డైన వాడు 
ఏ పని చెప్పినా 
మూల్గు తాడు
ముక్కుతాడు

ఎద్దు చెప్పినట్లుగా 
పని చేయాలంటే 
వేయాలి దానికి 
ముక్కు  తాడు.

27, ఫిబ్రవరి 2012, సోమవారం

'అ'మూల్య మైనవి

అపౌరుషేయము లైన 
మన వేదములను సరిగా 
అర్థము  చేసుకుంటే 
అమూల్య మైనవి 

అపౌరుషముగా
తగిన జ్ఞానము నేర్వక 
అపార్థము చేసుకోవటం వల్ల
'అ'మూల్య మైనవి. 

22, ఫిబ్రవరి 2012, బుధవారం

'కల' కలము

కదన రంగంలో 
కదలి సృష్టి స్తుంది
వీరుని చేతి  కత్తి
కలకలము

కవన రంగంలో   
చరిత్ర సృష్టి స్తుంది 
తీరైన  వాని చేతిలో   
కల  కలము   

20, ఫిబ్రవరి 2012, సోమవారం

నా 'శం' కరుడు

వాక్కులు తానే పుట్టించినా 
మౌన వ్యాఖ్యతోనే 
ఎన్నింటినో  తెలిపే  
వాడు  నా  శంకరుడు 

చిక్కులు ఎన్ని చుట్టు ముట్టినా 
మౌనంగా ధ్యానిస్తే 
అన్నింటిని దులిపే 
భవ నాశం  కరుడు. 

16, ఫిబ్రవరి 2012, గురువారం

ఎందు'కోయిలా'

చక్కగా పాటలు పాడి 
అబినందనలు పొందుతున్న   
ఓ  కోయిలా!

పిల్లల పెంపకం  
వదలి నిందలు పొందుతున్నావు 
ఎందుకో  యిలా?

10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ముందడుగు

ముఖ్యమైన  పనికి 
వేయాలంటే 
ముందడుగు 

మనసునో 
మనసైన వారినో 
ముందడుగు.7, ఫిబ్రవరి 2012, మంగళవారం

సం'పద'

న్యాయంగా ఆర్జిస్తూ 
ధర్మంగా జీవిస్తూ
పొదుపుగా వుంటూ 
పెంచుకో  సంపద.

ఆనందాన్ని పంచుతూ  
ఆలుబిడ్డల పోషిస్తూ
పరుల సుఖం  కోరు కుంటూ 
నలుగురి కోసం పద. 


5, ఫిబ్రవరి 2012, ఆదివారం

లో'గిలి'

భగవంతునికి 
నెలవైతే మన 
మనసు   లోగిలి 

బ్రతుకు పోరాటానికి 
ఉంటుందా మన 
మనసులో   గిలి.4, ఫిబ్రవరి 2012, శనివారం

పెట్టకు 'వేలు'

అనవసరమైన
విషయాల్లో 
పెట్టకు వేలు 

అవసరం లేని
ఆడంబరాలకు 
పెట్టకు 'వేలు'. 3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

ఏ'కాకి'

పరులకు సాయం 
చేయని వాడు
పరమాత్మ తోడు లేని 
ఏకాకి 

పర లోకం వెళ్ళినా
వాడి పిండం ముట్టి 
చేయదు సాయం
ఏ  కాకి.2, ఫిబ్రవరి 2012, గురువారం

చేయి'కాలు'

 పనులు 
చేయాలంటే 
అవసరం 
చేయి, కాలు

అనవసర మైన 
పనులు 
చేశావంటే 
చేయి కాలు.

28, జనవరి 2012, శనివారం

(మా) నెయ్యము

బంధుత్వం  కన్నా 
కడు గొప్పది 
సుమా! నెయ్యము 

దాని విలువ తెలిసుంటే 
మనం స్నేహం 
చెయ్యటం  మానెయ్యము.
27, జనవరి 2012, శుక్రవారం

కోకిలా


                                                                                                                                       

తీయగా పాడటం
నీ సహజ గుణం
చక్కగా 
పాడు  కోకిలా!

ఎవ్వరూ వినటం 
లేదేమోనని 
వెచ్చగా 
పడుకోకిలా. 25, జనవరి 2012, బుధవారం

నేరము

చెడ్డ వారితో 
చెడ తిరిగే 
బ్రతుకు  నేరము                

వదలక పొతే
సుఖ శాంతులతో  
బ్రతుక నేరము.24, జనవరి 2012, మంగళవారం

రేపు

అప్పుడప్పుడు మనసు 
చెడ్డ ఆలోచనలను రేపు

అప్పుడు చెప్పాలి మనం 
దానికి  'నేడు కాదు రేపు'
                                                                           
23, జనవరి 2012, సోమవారం

సాయం

నేడు మనం
పరులకు
అందించే  సాయం   

రేపు మనకు 
అంది వచ్చే 
ఫలసాయం20, జనవరి 2012, శుక్రవారం

మన''సిబ్బంది'


లోకమనే
కార్యాలయంలో                                                         తోటివారంతా
మన  సిబ్బంది 

కలసి మెలసి 
పని చేయడం లో
పెట్టకూడదు వారి                   
మనసిబ్బంది.19, జనవరి 2012, గురువారం

నేల'పాలు'

See full size image
పరుగెత్తి పరుగెత్తి
త్రాగాలనుకోనేల  పాలు 

ముందు నీ కడ(వ) నీరు
కాకుండా చూసుకో   నేలపాలు.

18, జనవరి 2012, బుధవారం

మనవి

See full size imageపద్యము, అవధానము 
కేవలం మనవి 

తెలుగు వాడిగా వాటిని
ఆదరించగా మనవి.14, జనవరి 2012, శనివారం

కనుమా

See full size image తెలుగు నాట పండుగ
భోగి,  సంక్రాంతి,  కనుమా  

వెలుగు లీను నిండుగ
మన పల్లెల లోన  కనుమా

మూడు రోజుల సందళ్ళు 
చూడని కళ్ళెందు కనుమా. 

11, జనవరి 2012, బుధవారం

కో 'దండం'

See full size imageశ్రీ రామా !


ఎక్కు పెట్టు 


నీ   కోదండంనర రూప రాక్షసుల 


మట్టుబెట్టు 


నీకో   దండం.