25, నవంబర్ 2021, గురువారం

హా...నికరం

 

మద్యం త్రాగటం
ఆరోగ్యానికి హానికరం
మద్యం మానటం
ప్రభుత్వానికి హానికరం.


24, నవంబర్ 2021, బుధవారం

పెరక(గ)కుంటే

  

 తులసి వనంలో

 గంజాయి మొక్కలు 

 పెరకకుంటే భాయ్

 గంజాయి వనమై 

 తులసి మొక్కలు 

 పెరగకుంటాయోయ్

 
Like
Comment
Share

23, నవంబర్ 2021, మంగళవారం

"యాప్"యాయత

  

 స్మార్ట్ ఫోన్ లు 

 ఒకదానిపై ఒకటి 

 "యాప్"యాయత

 "చాట్" తాయి.

 

22, నవంబర్ 2021, సోమవారం

అనుకోవడం

 

అనుకున్నవి జరగవు
జరుగుతున్నవి కొన్ని
అనుకోకుండా ముందుగా
అనుకోవడం జరుగుతుంది.


17, నవంబర్ 2021, బుధవారం

దా..రుణాలు

 

పిలుస్తారు కొందరు
దా...ఋణాలు, తీసుకొమ్మని
వసూలు వేళ
దారుణాలు, తీర్చ రమ్మని.16, నవంబర్ 2021, మంగళవారం

ముయ్యి

 

చాపునీ చెయ్యి
అందుకో వెయ్యి
చెప్పింది చెయ్యి
ఓటును వెయ్యి
అంటే అను - "ముయ్యి"


12, నవంబర్ 2021, శుక్రవారం

ఓమాట

 

ఓమాట!
ఏమాటకామాటే!
క్రొత్తమాటలు
పుట్టించాలంటే
మాటలుకాదు.


6, నవంబర్ 2021, శనివారం

"మిడీ"ల క్లాస్

 

"గుట్టు"గా మెలగాలనుకుంటారు కొందరు "మిడిల్" క్లాస్ వాళ్ళు "ఓపెన్" గా వెలగాలనుకుంటారు కొందరు "మిడీ"ల క్లాస్ వాళ్ళు.


1, నవంబర్ 2021, సోమవారం

"విప్పు"కోకు

 

పదిమంది కంట్లో
పడాలనుకుంటే
"విప్" కావాలనుకో
"విప్పు"కోవాలనుకోకు.