23, జూన్ 2022, గురువారం

ఆ"చ్ఛా"దనం

 

ఆమె ఒంటిపైన కనం
సరియైన ఆచ్ఛాదనం
కొందరికది "అచ్ఛా"దనం
మరికొందరికి "ఛచ్ఛా"దనం.20, జూన్ 2022, సోమవారం

"వియ్ ఆల్" వారు

"వియ్ ఆల్" వారు వస్తారని

ఎదురు చూస్తున్నాం

"వియ్యాలవారు" వస్తారని

ఎదురు చూస్తున్నాం. 


17, జూన్ 2022, శుక్రవారం

31, మే 2022, మంగళవారం

వెల్ వి(పు)షర్స్

 

 నెట్టాలని చూస్తారు
వెల్ "విషర్స్"
మంచి "భావి"లోకి
"వెల్" పుషర్స్
మంచి "బావి"లోకి.


17, మే 2022, మంగళవారం

మ్యూ"చిక్కు"

 

సంగీతం
సాహిత్యాన్ని మోస్తే
"మ్యూజిక్కు"
మూస్తే, మ్యూ"చిక్కు"


19, ఏప్రిల్ 2022, మంగళవారం

"పోయం"

 

ఎంతో విలక్షణమైనది
తెలుగు "పోయం"
దానిని నిలబెట్టుకోవాలని
ఎందుకు తలపోయం?

11, ఏప్రిల్ 2022, సోమవారం

"కలి" విడిగా

 ఎక్కడో ఉండడు 

"కలి" విడిగా

పాపాత్ములతోనే

తిరుగుతుంటాడు  

కలివిడిగా.


9, ఏప్రిల్ 2022, శనివారం

మాజీ

 

అధికారం
ఉన్నప్పుడైనా
పోయినప్పుడైనా
"అమ్మగార్లు"
"మాజీ"లే.


6, ఏప్రిల్ 2022, బుధవారం

ఏల?

పబ్బు కేగనేల?
గబ్బు బట్టనేల?
మత్తు గోరనేల?
మాటు దాగనేల?


3, ఏప్రిల్ 2022, ఆదివారం

కూడిక

 

 అరుగుట కష్టం
పాపపు కూడిక
అవనికి నష్టం
పాపుల కూడిక.


31, మార్చి 2022, గురువారం

కా"స్తాగితే"

 

 ఆగక "తాగితే"
"స్వర్గానికి" దగ్గరగా
తాగక "ఆగితే"
"నరకానికి" దూరంగా.


30, మార్చి 2022, బుధవారం

"రాత-గీత"

 

అన్నీ కాగితలే ఐనా
కొన్ని ట్రంకు పెట్టె లోకి
కొన్ని చెత్త బుట్టలోకి
వాటి "రాత-గీత"ను బట్టి.

24, మార్చి 2022, గురువారం

'ఏ' మరక

 

చూసుకో అంటకుండా
నీకు ఏ మరక
ఎటో ఆలోచించక
ఉండాలి ఏమరక.

23, మార్చి 2022, బుధవారం

"అద్దం" పడుతోంది

 

ప్రతిరోజూ నా కోసం
తానే వచ్చేది
వస్తూనే నాపై వాలిపోయేది
తన అందాన్ని చూపేది
ముక్కుతో సుతారంగా తడుతూ
చక్కలిగింతలు పెట్టేది
నాలో తనను చూసుకునేది
నన్ను ము(మె)రిపించేది
ఇది కొన్నేళ్ళ క్రితం
ఇప్పుడు తాను రావట్లేదు
ఎటుపోయిందో తెలియట్లేదు-
అంటూ "మసకబారిన" ముఖంతో
హృదయ వేదనను
మా వసరా గోడమీది
"అద్దం" పడుతోంది
మనిషి "బుజ్జి పిచ్చుకల" పై
వేసిన బ్రహ్మాస్త్ర "స్మార్ట్"చర్యకు
"అద్దంపడుతోంది"


15, మార్చి 2022, మంగళవారం

"డ్రై" వరుడు


"వరుడు"
రాబోయే
సంసారపుబండికి
"డ్రైవరుడు"
నడపలేక పోతే
"డ్రై" వరుడు.


9, మార్చి 2022, బుధవారం

"నలుసు"

 

 "కనుట" కష్టమే
కంట్లోనైనా
కడుపులోనైనా
"నలుసు" పడితే.


8, మార్చి 2022, మంగళవారం

"అక్షరాలా"

 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

"MALE" కన్నా "FEMALE"
"MEN" కన్నా "WOMEN"
"అక్షరాలా" ఎక్కువే


అది "రేపని"

 

నలుగురు
మెచ్చేట్లు చెయ్
"అదిరేపని"
వాయిదా
వేయకుమోయ్
అది "రేపని"6, మార్చి 2022, ఆదివారం

28, ఫిబ్రవరి 2022, సోమవారం

"తగవు"

 


 ప్రతి వాడితో
గిల్లికజ్జాలు తగవు
"ప్రతిదాడి" తో
మొదలౌతుంది "తగవు"


27, ఫిబ్రవరి 2022, ఆదివారం

"ఎత్తు"కెళ్తారు

 

మస్తకమున పెంచి దాచితే జ్ఞానం జీవితంలో "ఎత్తు"కెళ్తారు మస్తుగా పెంచి దాచితే ధనం ఏ దొంగలో "ఎత్తుకెళ్తారు."
24, ఫిబ్రవరి 2022, గురువారం

ఎం "డల్"

 

ఏం "డల్" గా ఉన్నావ్
బాబాయ్?
"ఎండల్" గా ఉన్నాయ్
బాబోయ్!


7, ఫిబ్రవరి 2022, సోమవారం

"లత" వాడిపోయింది

 భారత రసాలము పైని 

కోకిలమ్మను  "కాలం" తీసుకెళ్ళింది

గాన సౌగంధిక పుష్పాలను  

పూచే గాత్ర"లత" వాడిపోయింది

పై వాడి "సంగీత విభావరి"పిలుపుతో

"సుస్వరం"మనలను వీడి పోయింది. 


   

5, ఫిబ్రవరి 2022, శనివారం

"వాట్"

 

"వాట్" అంటే ఏమిటి?
వాట్ అంటే "ఏమిటి"
"మనీ" అంటే అర్థము?
మనీ అంటే "అర్థము"

19, జనవరి 2022, బుధవారం

అరువు

 

"అర్థం" లేక తెచ్చే
"అర్థంలేని" అరువు
అనర్థంరా అని
అదేపనిగ అరువు.


17, జనవరి 2022, సోమవారం

కవి"రాత"


ఓ దేవుడా!
కవిని జాగ్రత్తగా చూసుకో
అందరి "రాతలు" నీ చేతిలో
మరి "నీరాతలు" కవి చేతిలో.14, జనవరి 2022, శుక్రవారం

ఇంగితం

 

పుట్టుకతో నీ చేతికి
వంద చుక్కల తెల్ల కాగితం
జీవితపు ముగ్గును
ఎలా వేసుకుంటావో నీ ఇంగితం.


12, జనవరి 2022, బుధవారం

డి "వైన్" సేవ


స్వర్గానుభూతికి
రెండే మార్గాలు
ది "వైన్" సేవనము
"డివైన్" "సేవ"నము


8, జనవరి 2022, శనివారం

"వేవ్" ఇళ్ళు

 

కరోనా, ఒమిక్రాన్లకు "వేవిళ్ళు"
"డెలివరీకి" పిలిస్తే
మీ ఇళ్ళు అవుతాయి "వేవ్" ఇళ్ళు
చేయాలనుకోకండి "సీమంతం"
చేయాలి వాటికి "సీన్" అంతం.


7, జనవరి 2022, శుక్రవారం

2, జనవరి 2022, ఆదివారం

"దూకుడు"


రాజకీయ నాయకులు
కొందరికలవాటు
అధికారంలో దూకుడు
అధికారం కోసం "దూకుడు"


1, జనవరి 2022, శనివారం

"అన్ కూల్"

 మీకు మీ కుటుంబ సభ్యులకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

క్రొత్త సంవత్సరం
కాలెండర్ ని "కూల్ గా" మార్చడమేకాదు
"అన్ కూల్" కాలాన్ని కూడా
"అనుకూలంగా" మార్చుకోవాలి.