23, సెప్టెంబర్ 2022, శుక్రవారం

ఓపెన్ గా

 

ఓపెన్ గా
మాట్లాడేవాళ్ళు
కొందరు
"ఓపెన్" గా ఉండి
మాట్లాడే వాళ్ళు
కొందరు.

21, సెప్టెంబర్ 2022, బుధవారం

20, సెప్టెంబర్ 2022, మంగళవారం

"అర" విందం

 

ప్రతి మనిషి ముఖం
"అరవిందం"
"మాస్కు" తో అవుతోంది
"అర" విందం.


17, సెప్టెంబర్ 2022, శనివారం

'పూర్' "షో" త్తములు

 

మంచిని 
ఆచరించే వారు
పురుషోత్తములు
ఊరక 'షో' చేసేవారు
'పూర్' "షో" త్తములు.


10, సెప్టెంబర్ 2022, శనివారం

హా! మీకే

ఆన్ లైన్ రుణ యాపులు

అందులో దారుణ పాపులు 

హామీలేక ఇచ్చే అప్పులు
హా! మీకే ఇక తిప్పలు. 8, సెప్టెంబర్ 2022, గురువారం

తలె(ల్లె)త్తుకు

చిన్నప్పుడు
తల్లెత్తుకు
తిరగాలనుకున్నావ్
పెద్దై
తలెత్తుకు
తిరగాలనుకో.


5, సెప్టెంబర్ 2022, సోమవారం

"గురు"తర బాధ్యత

 

గురువుది
గురుతర బాధ్యత
తగిన "బోధన"తో
నలుగురికీ
"గురి" కుదిరేట్టు
చేసుకొనవలసిన బాధ్యత
తాను దారి తప్పకుండా
తప్పకుండా సమాజాన్ని
దారిలో నడపాల్సిన బాధ్యత.
అట్టి గురువును
గౌరవించుకొనడం
మన బాధ్యత.

Like
Comment
Send

3, సెప్టెంబర్ 2022, శనివారం

అప్పు "లోడు"

 

పెరగకుండా చూసుకో
అప్పు "లోడు"
తిట్టకుండా చూసుకో
"అప్పులోడు"