30, అక్టోబర్ 2018, మంగళవారం

వాడి చేయి.


Image result for god help us


జీవన పోరాటం
నీ శక్తిని వాడి చేయి
వల్లకాక వేడితే
అందుతుంది పైవాడి చేయి.
29, అక్టోబర్ 2018, సోమవారం

నలు గురి వైపుImage result for aimలక్ష్యం చేరాలంటే 
చూడకు నలుగురి వైపు 
శ్రద్ధతో కొనసాగించు 
నీ సాధనలు గురివైపు.

28, అక్టోబర్ 2018, ఆదివారం

27, అక్టోబర్ 2018, శనివారం

తలదన్నువాడు.

Image result for soldier


సరిహద్దులో సైనికుడు
నిరంతర శ్రామికుడు
దేశ భద్రతల దన్నువాడు
శత్రువుల తలదన్నువాడు.


26, అక్టోబర్ 2018, శుక్రవారం

25, అక్టోబర్ 2018, గురువారం

కనబడే గుట్టుImage result for modern dress for girls


పెట్టినా కనబడని బొట్టు
కట్టినా కనబడే గుట్టు
కొందరి కట్టూ బొట్టు
అనిపించదా ఎబ్బెట్టు.

24, అక్టోబర్ 2018, బుధవారం

నాగరికంImage result for poor people
తక్కువ బట్టల్తో 
ఒళ్ళు కప్పుకోడానికి 
ప్రయత్నిస్తే పేదరికం
ప్రదర్శిస్తే నాగరికం.

21, అక్టోబర్ 2018, ఆదివారం

20, అక్టోబర్ 2018, శనివారం

18, అక్టోబర్ 2018, గురువారం

"అమ్మాయ"నిImage may contain: 1 personజగదంబను దలచి 
వేడితే "అమ్మా"యని 
తొలగిస్తుంది మనమనసుల 
కప్పిన "అమ్మాయ"ని.

15, అక్టోబర్ 2018, సోమవారం

బరువు

Image result for boy carrying school bagపిల్లలు వీపుపై
పుస్తకాల బరువు 
వారి"స్కూల్ ఫీజ్" 
మోసుకెళ్తున్నాడా అన్నట్టు.

14, అక్టోబర్ 2018, ఆదివారం

"మీటు" తారలు


Image result for mee too movement

ఈ "మీ టూ" తారలు
తమగతాన్ని "మీటు" తారలు
ఎటువేస్తారో అంగలు
కొందరు సినిమాస్టార్లు, మాస్టార్లు
తేలుకుట్టిన దొంగలు.


10, అక్టోబర్ 2018, బుధవారం

ఆ వల


Image result for fraud love

అమ్మాయీ! వలపన్ని వలపని
వచ్చి వేస్తారు కొందరు ఆ వల 
అమ్మా! యీ వలో, వలపో
గమనించకుంటే వలవల ఏడుపే ఆవల.

8, అక్టోబర్ 2018, సోమవారం

నీ తల పేలే


Image result for bad hair


శుభ్రంగా ఉంచుకోకుంటే 
పడతాయి నీతల 'పేలే' 
నలుగురు మెచ్చాలంటే   
స్వచ్చంగాఉండాలి నీ 'తలపేలే'.

7, అక్టోబర్ 2018, ఆదివారం

వేళ్ళుImage result for video games

వీడికెప్పుడూ వీడియో గేంలు 
కేవలం కదిలేది వేళ్ళు
ఆరోగ్యంవీడి అనారోగ్యం
ఊనుకుంటుంది వేళ్ళు. 

5, అక్టోబర్ 2018, శుక్రవారం

ఎండెప్పుడూ


Image result for summer sun light

ఎండాకాలం కాలేదు రిలీవు
వానాకాలానికి ఎవరిచ్చారీ లీవు
మాడ్చుతోంది ఎండెప్పుడూ
ఈ ఎండలకు ఎండ్ ఎప్పుడూ?

4, అక్టోబర్ 2018, గురువారం

ఆ పుట

Image result for self history book
చరిత్రపుస్తకంలో నీకోటా
ఎదురు చూస్తోంది ఆ పుట
నీచరిత ఘనంగా మలచుకుంటే
ఎవరికైనా సాధ్యమా ఆపుట?