20, ఆగస్టు 2017, ఆదివారం

చరవాణిని చేరెను నెట్టు


Image result for cell phone


చరవాణిని చేరెను నెట్టు 
చేరి లోపల నిలచెను గుట్టు  

అరచేతిలొ  అమరేటట్టు
అరచేపనికి శెలవిచ్చేట్టు   

దూరం వారిని దగ్గర చేసేట్టు
దగ్గర వారిని దూరం జరిపేట్టు 


పిల్లలకు ఎన్నో ఆటలు నేర్పేట్టు  
వారి భవిష్యత్తుతో ఆటలు ఆడేట్టు   

అరె మహాద్భుతమని అనేట్టు   
మరి భూతము లాగా  పట్టేట్టు      


అది భూతమా,అద్భుతమా, కనిపెట్టు 
కనిపెట్టడం కష్టమే అదో కనికట్టు.    

8, జులై 2017, శనివారం

రాజుకుంటే.

ఆపగలమా మనం కొరడాదెబ్బలు 
కొట్టాలనే తలపు రాజుకుంటే. 

గదిలో పెట్టి కొడితే ఎదురు తిరగదా 
పిల్లి అయినా సరే కోధాగ్ని రాజుకుంటే.     

30, మార్చి 2017, గురువారం

రసమయము.


దేవుడు అందరికీ ఇచ్చింది రోజుకు
ఇరువది నాలుగు గంటలేర, సమయము

కష్టాలమయం కాకుండా ప్రతిరోజును
మలచుకుంటే అవుతుందిలే రసమయము.