31, మార్చి 2022, గురువారం

కా"స్తాగితే"

 

 ఆగక "తాగితే"
"స్వర్గానికి" దగ్గరగా
తాగక "ఆగితే"
"నరకానికి" దూరంగా.


30, మార్చి 2022, బుధవారం

"రాత-గీత"

 

అన్నీ కాగితలే ఐనా
కొన్ని ట్రంకు పెట్టె లోకి
కొన్ని చెత్త బుట్టలోకి
వాటి "రాత-గీత"ను బట్టి.

24, మార్చి 2022, గురువారం

'ఏ' మరక

 

చూసుకో అంటకుండా
నీకు ఏ మరక
ఎటో ఆలోచించక
ఉండాలి ఏమరక.

23, మార్చి 2022, బుధవారం

"అద్దం" పడుతోంది

 

ప్రతిరోజూ నా కోసం
తానే వచ్చేది
వస్తూనే నాపై వాలిపోయేది
తన అందాన్ని చూపేది
ముక్కుతో సుతారంగా తడుతూ
చక్కలిగింతలు పెట్టేది
నాలో తనను చూసుకునేది
నన్ను ము(మె)రిపించేది
ఇది కొన్నేళ్ళ క్రితం
ఇప్పుడు తాను రావట్లేదు
ఎటుపోయిందో తెలియట్లేదు-
అంటూ "మసకబారిన" ముఖంతో
హృదయ వేదనను
మా వసరా గోడమీది
"అద్దం" పడుతోంది
మనిషి "బుజ్జి పిచ్చుకల" పై
వేసిన బ్రహ్మాస్త్ర "స్మార్ట్"చర్యకు
"అద్దంపడుతోంది"


15, మార్చి 2022, మంగళవారం

"డ్రై" వరుడు


"వరుడు"
రాబోయే
సంసారపుబండికి
"డ్రైవరుడు"
నడపలేక పోతే
"డ్రై" వరుడు.


9, మార్చి 2022, బుధవారం

"నలుసు"

 

 "కనుట" కష్టమే
కంట్లోనైనా
కడుపులోనైనా
"నలుసు" పడితే.


8, మార్చి 2022, మంగళవారం

"అక్షరాలా"

 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

"MALE" కన్నా "FEMALE"
"MEN" కన్నా "WOMEN"
"అక్షరాలా" ఎక్కువే


అది "రేపని"

 

నలుగురు
మెచ్చేట్లు చెయ్
"అదిరేపని"
వాయిదా
వేయకుమోయ్
అది "రేపని"



6, మార్చి 2022, ఆదివారం