29, జులై 2021, గురువారం

గురువు


 నీలో ఉన్న
తెలివి అనే వత్తిని
కృషి అనే తైలాన్ని
కలిపి జ్యోతి లా వెలిగేట్లు
చేసేవాడు, గురువు.

"కావ" రమ్మని

 

భక్తులు భగవంతుణ్ణి
"కావ" రమ్మని అంటారు
వారిని కష్టపెట్టే వారికి
"కావరమ్మని" అంటారు.

ఫి(వి)ట్నెస్సు

 

ప్రతిదానికీ కావాలా
ఐ విట్నెస్సు?
ఈ కళ్ళకు లేదంత
హై ఫిట్నెస్సు.


24, జులై 2021, శనివారం

"విష్"యం

 

విషయం ఏంటంటే
విషయం గురించి
"విష"యంగా చెప్పేవారు కొందరు
"విష్"యంగా చెప్పేవారు కొందరు
"విషయం"గా చెప్పేవారు కొందరు


23, జులై 2021, శుక్రవారం

చిత్రం - మంత్రం.

 

వర్ణములు హెచ్చు తగ్గులలో స్రష్టల చేత కలుపుట - చిత్రం వర్ణములు హెచ్చు తగ్గులలో ద్రష్టల చేత పలుకుట - మంత్రం. 


20, జులై 2021, మంగళవారం

"నవ" నాడులు

 

నిరాశతో నిలబడితే
క్రుంగి పోతాయ్ నవనాడులు
ఆశతో పయనిస్తే
నవ్వుతూ ఎదురొస్తాయ్ "నవ" నాడులు.


18, జులై 2021, ఆదివారం

16, జులై 2021, శుక్రవారం

ఆగడాలు


 

పెచ్చుమీరితే చీకటి ఆగడాలు
విచ్చుకుంటాయ్ వెలుగుల కాగడాలు
ఉండదు ఎక్కడా "ఆగడాలు"
కేవలం ముందుకు సాగడాలు.


13, జులై 2021, మంగళవారం

స్వా"గతిస్తారా?"


 "మాస్క్" తలుపు తెరచి
"మలిన" హస్తాలతో
మళ్ళీ "దాన్ని" పిలిచి
స్వా"గతిస్తారా?"


11, జులై 2021, ఆదివారం

"కేర్ కేర్"

 


తెల్లోడి భాషంటే మోజు
పిల్లోడికి కూడా
"కేర్ కేర్" మంటాడు
"కేర్" తీసుకోమంటూ.

10, జులై 2021, శనివారం

"గెస్ట్"

 

అనుకోని తిథిలో
వచ్చేవాడు "అతిథి"
గెస్ చేయని టైం లో
వచ్చేవాడు "గెస్ట్"


7, జులై 2021, బుధవారం

వాడనీ వీడనీ

 సమస్యల పై సమరానికి

ఉండకూడదు
వాడనీ, వీడనీ
ఎదురు చూపుల దైన్యం

ఉండవలసింది
వాడనీ వీడనీ
ఎదుర్కొనే ధైర్యం.


5, జులై 2021, సోమవారం

నిన్ దించడానికి

 


నిందించడానికి
వెనుకాడవు దైవాన్ని
నీకు వద్దన్నా పట్టదు

నిన్ దించడానికి
పాతాళంలోకి
విధికి నిమిషం పట్టదు.