29, నవంబర్ 2018, గురువారం

28, నవంబర్ 2018, బుధవారం

"WISH"యాలు

Image result for tv unit
ఓ మీడియాలూ!
ప్రక్కనబెట్టి మీ "WISH"యాలు
అంటించక ఏవో "విష"యాలు
అందించాలి అసలు "విషయాలు"

25, నవంబర్ 2018, ఆదివారం

''CALM''డు


Image result for god manmadha images


వాడిపేరు "కాము"డు
కానీ ''CALM'' గా ఉండడు
"మనిషి" కి "పిచ్చి" ఎక్కిస్తాడు
వాడిమరో పేరు MAN MAD.

18, నవంబర్ 2018, ఆదివారం

కాలునైనా


Image result for yamadharma image


ధర్మపు బాటలో సాగటానికి
మొదటగా కదపాలి ఒక కాలునైనా
అవసరమైతే ఎదిరించడానికి
సిద్ధంగా ఉండాలి ఇక కాలునైనా.


16, నవంబర్ 2018, శుక్రవారం

తప్పుకోరికImage result for black money images


పరులను మోసంచేసి
సంపాదించాలనేది తప్పు కోరిక
అయినా కొందరు
ఆ మార్గంనుండి తప్పుకోరిక.


15, నవంబర్ 2018, గురువారం

ప్రాసాదాలు
భక్తి ముసుగులో కొందరు
కట్టేది ఎత్తైన ప్రాసాదాలు
పెట్టేది మత్తైన ప్రసాదాలు
బాబా - బ్లాక్ షీప్.

14, నవంబర్ 2018, బుధవారం

వారి "లాగుండాలి".
Image result for dress code

చిన్నప్పుడు
చిన్నవారి "లాగుండాలి"
పెద్దప్పుడు
"పెద్దవారిలాగుండాలి".

11, నవంబర్ 2018, ఆదివారం

"కాల్" జారితేImage result for wrong call
"కాలు" జారితే వెనక్కు తీసుకోగలం 
కాని "కాల్" జారితే వెనక్కి తీసుకోలేం
జాగ్రత్త! ఒక "కాల్" 
జీవితాన్నే "కాల్చేస్తుంది."

10, నవంబర్ 2018, శనివారం

"ఆకళ్ళు"


Image result for deer and tigerఒంటరిగా వెళ్తున్న "లేడి"
తడబడుతూ బెదురుతో ఆ"కళ్ళు"
"మేల్" తల "వని“ పులులు
చూస్తున్న చూపుల్లో "ఆకళ్ళు"
9, నవంబర్ 2018, శుక్రవారం

"NOTE" to vote


Image result for vote images
విధానం "KNOW" to vote
చెప్పకు "NO" to vote
అడుగకు "NOTE" to vote
పై మూడూ "NOTE" to vote.

8, నవంబర్ 2018, గురువారం

7, నవంబర్ 2018, బుధవారం

బా(బీ)టలు

అందరకూ దీపావళి శుభాకాంక్షలు.

Image result for deepavali 2018


దీపావళి వేయాలి
వెలుగునకు బాటలు
మ్రోతలతో కాకూడదు
వీనులకు బీటలు.


6, నవంబర్ 2018, మంగళవారం

"రోగ్"లు.Image result for sweets images
తీపిని మాటవరసకు గూడా
దరిరానివ్వనివారు "రోగులు"
తీపి మాటలతో దరిజేరి
మోసగించేవారు "రోగ్"లు.


5, నవంబర్ 2018, సోమవారం

'కూల్' చేశావో


Image result for tree cutting images


కూల్చొద్దని 'వేడినా'
'కూల్' చేసే చెట్లను
కూల్చేశావో! 'వేడికి'
'కూలి' పోతావు.
4, నవంబర్ 2018, ఆదివారం

ఆగాలి ఈగాలిలోImage result for balloons
లోపలిగాలితో బయట గాలిలో
ఎగిరెగిరిపడే బూర వైనం
పగిలిందో ఆగాలి ఈగాలిలో 
ఆత్మ పరమాత్మలోలా లీనం.

3, నవంబర్ 2018, శనివారం

దారపు ఉండImage result for flower necklace
మురిసిపోతూ పూలదండ
నలుగురు మెచ్చుచూ ఉండ
ముడుచుకొని మెదలకుండ
మూలన దారపు ఉండ.


2, నవంబర్ 2018, శుక్రవారం

PRE(A)Y మించి

Image result for love images


PRAY మించినా  
ప్రేమించకపోతే ఆత్మహత్య
ప్రేమించకపోతే 
PREY మించి హత్య. 

1, నవంబర్ 2018, గురువారం

తొడపాశం
Image result for traditional mother


తోడి పాయసం పెట్టాలో
తొడపాశం పెట్టాలో
ఎప్పుడేదో తెలుసు నీ మంచికోసం
అమ్మకైనా అమ్మవారికైనా.