31, డిసెంబర్ 2018, సోమవారం

డ్రస్సు - అడ్రస్సు

Image result for conventional dress images

మనిషిని "గుర్తించడానికి"
ఉండాలి సరైన అడ్రస్సు
"మనిషిగా" గుర్తించడానికి
ఉండాలి సరైన డ్రస్సు.

27, డిసెంబర్ 2018, గురువారం

"విన్" యోగం.


Image result for time


చేశావా సరియైన
సమయ వినియోగం
లక్ష్యసిద్ధికవుతుంది
అది "విన్" యోగం.

26, డిసెంబర్ 2018, బుధవారం

వాటేసుకోకు

Image result for facebook whatsappఫ్హేస్ బుక్కును
ఫేసుకు అతికించుకోకు
వాట్సప్పును
వదలక వాటేసుకోకు.

25, డిసెంబర్ 2018, మంగళవారం

23, డిసెంబర్ 2018, ఆదివారం

"లై" సెన్స్.


Image result for lier


అబద్ధాల"నమ్ముకొని" 
బ్రతుకుతారు కొందరు
ఎవరిచ్చారు "లైసెన్స్"
అది వారి "లై" సెన్స్.

22, డిసెంబర్ 2018, శనివారం

ఉలికి


Image result for making statue

కాబోయే శిల్పమా!నిగ్రహించుకో
ఉలికి భయపడి
ఉలికి పడడమెందుకు
ఆదెబ్బలు నీమంచికే.

21, డిసెంబర్ 2018, శుక్రవారం

"నోట్"లో


Image result for currency background


మనిషి జీవితం 
కరెన్సీ "నోట్"లో 
మంచితనం
మాట్లాడే నోట్లో.

"పంప్"ఇస్తాడు


Image result for cloudy sky backgroundదూదిపింజల మేఘాల్లోకి 
నీటిని "పంప్"ఇస్తాడు సూర్యుడు
వాటినెటో నెట్టుకెళ్ళి
పిండేస్తుంటుంది గాలి.

17, డిసెంబర్ 2018, సోమవారం

12, డిసెంబర్ 2018, బుధవారం

అలకెందుకు


Image result for sea shore pics


ఎప్పుడూ బయటకు నెట్టేస్తుంది
సముద్రానికి అలపై అలకెందుకు?
గెంటినా మరలా లోపలికే వెళ్తుంది
దానిపై మమకారం అలకెందుకు?


11, డిసెంబర్ 2018, మంగళవారం

ఎ "ఫైర్"


Image result for affair with other wife


పర పతి, సతులతో 
సాగించే "ఎఫైర్"
పరపతిని పూర్తిగా
కాల్చేసే ఎ "ఫైర్"

10, డిసెంబర్ 2018, సోమవారం

ముం 'చెడు అలవాట్లు'Image result for bad habitsఆకర్షిస్తాయి జాగ్రత్త
చెడు అలవాట్లు
అవుతాయి నీ భవితను
ముంచెడు అలవాట్లు.

.

9, డిసెంబర్ 2018, ఆదివారం

వాడుపోయాక
Image result for deathమనిషెంత మంచివాడో
ఎదుటివాడి మంచితనాన్ని
ఎదలోనే దాచుకుంటాడు
వాడుపోయాక చెప్పడానికి.8, డిసెంబర్ 2018, శనివారం

తీరిక

Image result for happy home images


జీవితం బిజీనెస్
అంతా బిజినెస్
ఉందా సరదాగా గడిపే తీరిక
మారుతుందా నిజంగా ఈ తీరిక.


7, డిసెంబర్ 2018, శుక్రవారం

6, డిసెంబర్ 2018, గురువారం

4, డిసెంబర్ 2018, మంగళవారం

1, డిసెంబర్ 2018, శనివారం

మందెక్కువైతేImage result for drinkingమందెక్కువైతే మజ్జిగ పల్చన 
మందెక్కువైతే మజ్జిగతో పల్చన
మందెక్కువైతే ఆరోగ్యం పల్చన
మందెక్కువైతే సంఘంలో పల్చన.