31, అక్టోబర్ 2020, శనివారం

"ఓం" వర్కు.


 శ్రద్ధగా చెయ్యి
"ఓన్" వర్కు
"హోం" వర్కు
అశ్రద్ధ చేయకు
"ఓం" వర్కు.


30, అక్టోబర్ 2020, శుక్రవారం

"ఊర"కుంటారా?

 

శ్రమచేయకుండటం
"ముద్దని" ఊరకుంటారా!
తిని అలా కూర్చుంటే
"ముద్ద"ని "ఊర"కుంటారా?

29, అక్టోబర్ 2020, గురువారం

ఆ "కళ్ళు".


 కొందరికి ఆహారం
దొరకక ఆకళ్ళు
కొందరికి "డైటింగ్"
నీరసంతో ఆ "కళ్ళు".

"బూతు"లనుండి "బూతు"లనుండి ఎన్నుకొనే
నాయకులవగానే
"బూతులను" ఎన్నుకొనే నాయ "కుల" వాలా?

26, అక్టోబర్ 2020, సోమవారం

"పా(యా)పుల" భారం


 ఫోనుకు "యాపుల" భారం
భూమికి "పాపుల" భారం
అవుతోంది అనివార్యం
సెల్కాలం, కలికాలం


25, అక్టోబర్ 2020, ఆదివారం

మామూలే

 

ఉల్లిపాయ,రాజకీయ జీవితం
"ధర" లో ఒకటే విధం
ఎగ"బాకుట" దిగ"జారుట"
అంతా మామూలేనట.


24, అక్టోబర్ 2020, శనివారం

ఏడుస్తూ నీళ్ళు


 పూడుస్తూ చెరువులను
అడ్డగోలుగా కట్టిన ఇళ్ళు

ఏడుస్తూ తమ ఇళ్ళను
వెతుక్కుంటూ వస్తున్న నీళ్ళు

"పగబట్టిన నాగు"

 

"తన పుట్టను"
త్రవ్విన వారిపై
"పగబట్టిన నాగు" లా
వస్తోంది నగరాల్లోకి
వరద నీరు.22, అక్టోబర్ 2020, గురువారం

"పడవలే"


 "సబ్" సిటీ జనులు
వరదకష్టాలెందుకు పడవలే?
"సబ్సిడీ" పై ఇవ్వాలి
అందరికీ "పడవలే"


21, అక్టోబర్ 2020, బుధవారం

"యాక్" సీజన్.

 

ఆంగ్లం అయ్యింది
"ఆక్సీజన్"
ఆంధ్రానికిప్పుడు
"యాక్" సీజన్.

18, అక్టోబర్ 2020, ఆదివారం

"నీట్"నగరాలు.

 

కంటితోన చూస్తే
మహా "నీట్" నగరాలు
గంట వాన కురిస్తే
మహా "నీటి" నగరాలు.


16, అక్టోబర్ 2020, శుక్రవారం

"స్వధర్మం"


 "స్వధర్మం" పాటిస్తూ
హెచ్చరికకు చూపుడువేలే
నేనూ వేలునేనంటూ
చిటెకెనవేలొస్తే ఎలా?


15, అక్టోబర్ 2020, గురువారం

నీవెంటే

 

కడిగిన చేతులు
"కరోనా" కు వాతలు
కాదని నీవుంటే
"కోవిడ్" నీవెంటే.


12, అక్టోబర్ 2020, సోమవారం

"ఉండి" పోరు

 

ఇక్కడ కలకాలం
ఎవరూ "ఉండిపోరు"
చేయాలి ధర్మం కోసం
భూమిపై "ఉండి" పోరు

6, అక్టోబర్ 2020, మంగళవారం

"won" టిల్లు.

 ఇప్పుడు వంటిల్లు 

ఒంటికి మంచి "ఒంటిల్లు" 

నంబర్ "one"టిల్లు

కరోనాపై "won" టిల్లు.


 

5, అక్టోబర్ 2020, సోమవారం

ఆ "శ్రమ" జీవులు

 

కూడుబెట్టే సంపాదన కోసం
కొందరు ఆ "శ్రమ" జీవులు
కూడబెట్టే సంపాదన కోసం
కొందరు "ఆశ్రమ" జీవులు.


4, అక్టోబర్ 2020, ఆదివారం

"వారి" యరులం

 మనం దాని శత్రువులం

"కరోనావారి" యరులం 

మనం ఆ యుద్ధ సైనికులం

కరోనా "వారియర్లం". 
2, అక్టోబర్ 2020, శుక్రవారం

ఎ(బె)దురు చూపులు

 

ఇంటిపై కాకి అరిస్తే
నిన్నటి వరకూ
ఎదురు చూపులు
నేడు బెదురు చూపులు.


1, అక్టోబర్ 2020, గురువారం

అవ'తల పెట్టు'

 

పట్టుదలను చూపెట్టు
గట్టిపనిని తలపెట్టు
తలపట్టుకొనే పనిని
తలపెట్టక అవతల పెట్టు.