31, ఆగస్టు 2018, శుక్రవారం

అదరక బెదరక


Image result for courageous

కుడికన్ను అదిరిందని ఖుషీఖుషీ అయిపోకు
ఎడమకన్ను అదిరిందని ఏడుస్తూకూర్చోకు
ఏది అదిరినా అదరక బెదరక
కుదురుగా ఉండేవాడే ధీరుడు.

29, ఆగస్టు 2018, బుధవారం

సెల్ఫీ సమాధి


Image result for selfie accident death


తమను తాము "స్వయంగా" తెలుసుకుంటూ 
జ్ఞానులు కొందరు "సమాధిలోకి
తమను తాము "సెల్ఫీ" తీసుకుంటూ
అజ్ఞానులు కొందరు "సమాధి"లోకి.

28, ఆగస్టు 2018, మంగళవారం

మోతగా


Image result for musical composer


సంగీతం ఉండాలి
సాహిత్యానికి పల్లకీ మోతగా
కాకూడదు మూతగా
డబ్బాలో గులకరాళ్ళ మోతగా.

25, ఆగస్టు 2018, శనివారం

"చుక్క" లు


Image result for drunk man walking"చుక్క"కై దాహం 
"చుక్కల"పై వ్యామోహం 
ఆరోగ్యానికి పెట్టి "చుక్క" 
ఆనక చూపిస్తాయి "చుక్కలు."

23, ఆగస్టు 2018, గురువారం

"ఛా" లెంజి


Image result for keekee and ice bucket challenge


ఐస్ బకెట్ స్నానం  
కీకీ నాట్యం "ఛా" లెంజిలు 
రైస్ బకెట్ దానం 
నల్గురికీ సాయం "ఛాలెంజ్" లు.

22, ఆగస్టు 2018, బుధవారం

"పై.డి"


Image result for circumference of circle

"పైడి" తో ఏదైనా విలువైనది 
కొనుక్కోవచ్చునంటారు మా తెలుగుపంతులుగారు
"పై.డి" తో ఏదైనా వృత్తంచుట్టుకొలత 
కనుక్కోవచ్చునంటారు మా లెక్కల మాష్టారు.

21, ఆగస్టు 2018, మంగళవారం

"షై"నికుడు


Image result for soldier and drinker


మనసారా ధైర్యంతో ప్రాణాలను పణంగా పెడతాడు 
దేశానికి బలం ఆ సైనికుడు 
మన "సారా" ధైర్యంతో ఆరోగ్యాన్ని పణంగా పెడతాడు 
ప్రభుత్వానికి "బలం" ఈ "షై"నికుడు.

17, ఆగస్టు 2018, శుక్రవారం

తప్పు, కొనలేము.


Image result for love imagesప్రేమను డబ్బుతో కొనగలమనుకుంటే 
తప్పు, కొనలేము. 
ప్రేమిస్తే మన బాధ్యతలనుండి 
తప్పుకొనలేము.  

16, ఆగస్టు 2018, గురువారం

నిశ్శబ్దంఫుల్లు


Image result for group cell callఆ ఇల్లు ఒక పొదరిల్లు

ఏడుగురు సభ్యుల హరివిల్లు
చేతుల్లో తలాఒక సెల్లు 
మాటలునిల్లు నిశ్శబ్దంఫుల్లు

15, ఆగస్టు 2018, బుధవారం

"మూడు" రంగులు


Image result for indian flag
ధర్మచక్రం గలిగిన నిండైన 
మన జెండాకు మూడురంగులు
శత్రువుల పాలిటి "మూడు" రంగులు 
వచ్చారా "రంగు పడుద్ది." 

14, ఆగస్టు 2018, మంగళవారం

"కక్కే" స్వేచ్ఛ


Image result for speaking vomiting


ప్రతివారికీ ఉంటుంది తమలోపల్ది
బయటకు "కక్కే" స్వేచ్ఛ
బయట వారు ఇబ్బంది
"పడకుండా" చూసే బాధ్యత లేదా, ఛాఛ!

11, ఆగస్టు 2018, శనివారం

విన్నవిం 'చేను'


Image result for fencing of farm

వాడు చేయాల్సింది కన్యాదానం
హద్దు దాటి చేశాడు గర్భాధానం
కంచే మీదపడి మేస్తే, చేను
తనబాధ నెవరికి విన్నవించేను?

10, ఆగస్టు 2018, శుక్రవారం

సెల్లు పోటుImage result for talking cell phone

చేయి బుగ్గమీదుంటే "పన్నుపోటు"
చెవివద్ద ఉంటే "చెవిపోటు"
రెండింటికీ ఆనించి ఉంటే?
"సెల్లు పోటు"


8, ఆగస్టు 2018, బుధవారం

గుండె చెరువు


Image result for farmer waiting for rain images
చెరువుల్లో నీళ్ళు నింపలేక
మేఘం "తెల్లమొగం" వేస్తే
రైతుకు "నల్లమొగం"
గుండె చెరువు, కళ్ళల్లో నీళ్ళు.


3, ఆగస్టు 2018, శుక్రవారం

గాలిపోలీసు
Image result for thunder rain drop
"నల్లధనం" దాచిన
"మబ్బు"గాళ్ళను
ఈడ్చికొట్టి "ఉరిమి","షాకిచ్చి"
కక్కిస్తున్నాడు "గాలిపోలీసు".


2, ఆగస్టు 2018, గురువారం

నరకం


Image result for greenery...tree cutting
పచ్చదనం లేకుంటే 
నరలోకం నరకం
ఇది తెలిస్తే చెట్లను
ఇష్టం వచ్చినట్లు నరకం.