28, డిసెంబర్ 2023, గురువారం

క(ల)వరింగ్

 ఉండాలి సరియైన కవరింగ్

విత్ "విష్"టమైన కలరింగ్
'ఫోను' కు డస్ట్ ప్రూఫ్
'మేను' కు దృష్టి ప్రూఫ్


24, డిసెంబర్ 2023, ఆదివారం

"విల్"సిల్లు

 "అప్పు"లేని ఇల్లు

"ఆప్" లున్న సెల్లు
గొప్పగా "విల్"సి
ల్లు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

మారిపోతుంది

 ఎక్కడ వత్తాలో 

ఎక్కడ ఆపాలో 

తెలియకపోతే

మాట అర్థం 

మారిపోతుంది 


ఎక్కడ తగ్గాలో

ఎక్కడ నెగ్గాలో

తెలియకపోతే

జీవన గమనం

మారిపోతుంది.



20, డిసెంబర్ 2023, బుధవారం

"నిల్" పడేట్లు

 సాహిత్యం, సంగీతం, గానం

కలిసి పాటను కలకాలం
నిలబడేట్లు చేయాలి
"నిల్" పడేట్లు కాదు.

19, డిసెంబర్ 2023, మంగళవారం

తెలుగు "వాడి"

 తెలుగువాడిది ఒకటే మాట

"తెలుగువాడ" నని 

గర్వంగా అనటం

తెలుగు "వాడనని"

గర్వంగా అనటం

అది తెలుగు "వాడి"కే చెల్లింది.



15, డిసెంబర్ 2023, శుక్రవారం

"గీత" కార్మికుడు

 నేడు "బాపు" గారి జన్మదినం సందర్భంగా....


తెలుగువారి మనసులకు
ఆహ్లాదపు "మత్తును"
అలవాటు చేసిన
"గీత" కార్మికుడు
మన "బాపు"


13, డిసెంబర్ 2023, బుధవారం

భోజ(న) రాజు

 ఏరీ! నాటి

కృష్ణ రాయలు

భోజరాజులు?


నేడు ఉన్నారు

తృష్ణ రాయలు

భోజన రాజులు


10, డిసెంబర్ 2023, ఆదివారం

లో "కన్ను"

 మనిషికి ముఖ్యం

లోకమును 

తెలుసుకోవటం 

లో కన్ను 

తెరుచుకోవటం.


8, డిసెంబర్ 2023, శుక్రవారం

క్రియేటర్

 మనిషిగా పుట్టి

కాకూడదు కేవలం "ఈటర్"

అవకూడదు అసలే "ఛీటర్"

అవాలి చరిత్ర "క్రియేటర్" 

7, డిసెంబర్ 2023, గురువారం

నవ్వేడేస్

 ఉరుకులు పరుగులు

అందోళనతో "నౌ ఎ డేస్"


మలచుకుంటే వాటిని

అవుతాయి "నవ్వేడేస్"



6, డిసెంబర్ 2023, బుధవారం

ముద్ద

 ఆకాశం మూకుడులో, నల్లనయ్య 

పంచటానికి దాచుకున్న 

వెన్న ముద్ద-పున్నమ చంద్రుడు

నింగి పళ్ళెంలో, ప్రకృతికాంత 

పారాణికోసం కలుపుకున్న 

పసుపు,సున్నం ముద్ద - పడమటి సూర్యుడు.

30, నవంబర్ 2023, గురువారం

రోగం.

 ఓటరులారా!

ఓటు వేయటం
ఒక యాగం
మీకు కూడా ఉంది
అందులో భాగం
ప్రలోభాలకు లొంగక
చెయ్యాలి త్యాగం
మంచి నాయకుణ్ణి
ఎన్నుకుంటే భోగం
అవకుండా ఉంటుంది
ప్రజాస్వామ్యం ఆగం
ఇంతచెప్పినా వినకుంటే
అది మీకున్న రోగం.

28, నవంబర్ 2023, మంగళవారం

వ్యర్థం చేయక


నిన్నటి "భూతా"న్ని
పట్టుకొనక వదిలించుకో

రేపటి మిగిలిన కాలాన్ని
"ఫ్యూ"చరమే అని భావించుకో

నేటిది మాత్రమే దేవుని
"ప్రెజెంట్"గా స్వీకరించుకో

వ్యర్థం చేయక నిమిషాన్ని
సద్వినియోగం అయేట్లు చూసుకో


15, నవంబర్ 2023, బుధవారం

"విష్" టం

 పెద్దవారైనా...


అందరికీ ఇష్టం
చిన్ననాటి విషయాలు
అవధరించటం

కొందరికి "విష్" టం
చిన్న"నాటీ" వస్త్రాలు
అవే ధరించటం.


5, అక్టోబర్ 2023, గురువారం

సున్నా

 సున్నా అంటే

ఎవరికీ లెక్క లేకున్నా
అదిలేకుంటే
అసలు లెక్కలే సున్నా

28, సెప్టెంబర్ 2023, గురువారం

కొలిచేవారు

 మండపాల్లో పూజకు

వినాయక విగ్రహాలను
తెచ్చి కొలిచేవారు కొందరు
"కొలిచి" తెచ్చేవారు కొందరు.

25, సెప్టెంబర్ 2023, సోమవారం

తీయనిదై

 పాటగాడికి మంచి "గొంతు"

ఉంటే చాలదు తీయనిదై
"గాడి"తప్పక ఉండాలి "పలుకు"
భాష పరువు తీయనిదై.

21, సెప్టెంబర్ 2023, గురువారం

"కల్" చరిస్తున్నాడు

 తన పథకాల అమలుకోసం

"కలి" చరిస్తున్నాడు
యువతకు పెడధోరణుల
"కల్చరిస్తున్నాడు"

19, సెప్టెంబర్ 2023, మంగళవారం

తగ్గేదే లా

 


"తగ్గేదే లా" అని

పెంచుతున్నాడు సూర్యుడు వేడి

వర్షాకాలమని 

గుర్తుచేయాలా ఆయనను వేడి?


14, సెప్టెంబర్ 2023, గురువారం

హానికరంగా

 మన పనులు ఉండాలి

లోకానికి మహా నికరంగా
మారకూడదు అవి
సమాజానికి యమ హానికరంగా

9, సెప్టెంబర్ 2023, శనివారం

"సన్" ఆట

 సనాతనమ్మేలా? అంటూ

ఒక సీయం "సన్" ఆట
సనూతనం మేలా? అంటూ
మొదలవుతోంది "సన్నాటా"

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

ళుళుళాయీ

 "విక్రం ల్యాండర్" భాయీ

"ప్రజ్ఞాన్ రోవర్" హాయ్ హాయీ 

మామదగ్గర ఈ రేయీ

నిద్దురపోండి "ళుళుళాయీ"


వీలు చూసి "చల్లటి సమయం"

వినండి అక్కడి "స్టోరీలు"  

"రీలురీలు" రేపుదయం 

చేయండి మాకు "రివీలు" 



29, ఆగస్టు 2023, మంగళవారం

తెలుగువాడా!

 తెలుగువాడా! ఏ వాడనున్నా

తెలుగు వాడి,
తెలుగు వాడిపోకుండా
తెలుగు 'వాడను' అనుకోకుండా
'తెలుగువాడను' అనుకుంటూ
తెలుగు 'వాడిని' పెంచాలనుకుని
'తెలుగువాడిని' పెంచి
తెలుగువాడిననిపించుకోవాలి

19, ఆగస్టు 2023, శనివారం

ఫాలోయ(వ)ర్

 


మనలను "ఫాలో" 

అవుతూ ఉంటారు  

కొందరు ఫాలో "యరులు"

కొందరు ఫాలో "వరులు"

తెలుసుకొని వేయాలి "అడుగు"లు. 




18, ఆగస్టు 2023, శుక్రవారం

బలుపు

 లేకుంటే

నోటిపై అదుపు
అ(క)నిపిస్తుంది
"ఒళ్ళు బలుపు."


3, ఆగస్టు 2023, గురువారం

కని "కట్టు"

 ఫ్యాషన్ కని కట్టు

దూరంనుండి చూస్తే లేనట్టూ
దగ్గరకొచ్చి చూస్తే ఉన్నట్టూ
కొందరి కట్టుబట్టా, బొట్టూ.



28, జులై 2023, శుక్రవారం

దాహం

 చావు బ్రతుకుల మధ్య ఒకడు

దాహంతో నోరెండి"పోతూ"

వీడియో తీస్తూ మరొకడు

మధ్యమధ్య "నీరు" త్రాగుతూ.




27, జులై 2023, గురువారం

24, జులై 2023, సోమవారం

ఎక్కువయ్యారు

ఇప్పుడు మరీ
ఎక్కువయ్యారు
భుజాలు తడుముకునేవారు
నరంలేని నాలుకవారు.

 

19, జులై 2023, బుధవారం

ఊరకుంటే

 ఏదో ఒక కాయకష్టం

చేయక ఊరకుంటే
నన్నడుగు నీ శరీరం
ఆనక ఊరకుంటే.


15, జులై 2023, శనివారం

టమాట మాట

 చవుకబారుదంటూ

త్రొక్కి పడేస్తూ మీరే
చవికి కావాలంటూ
బారులు తీరుతూ మీరే
...టమాట మాట





6, జులై 2023, గురువారం

"నో" టమాట

 ధరను చూస్తే

రావట్లేదు 

నోట మాట

ధరలో జనులు

అంటున్నారు

"నో" టమాట. 


5, జులై 2023, బుధవారం

సరి 'WAY' లు

 ఎన్నికలవేళ 

సర్వేలు ఎన్నో

ఎన్నుకునే

సరి 'WAY' లు కొన్నే. 


4, జులై 2023, మంగళవారం

బాధితులు

 బాధితులై అధికారికి

లంచం ఇస్తారు సామాన్యులు 

లంచం తీసుకొని 

అధికారమిచ్చి 

బాధితులౌతారు ఓటర్లు.


1, జులై 2023, శనివారం

మె(మొ)రుగు

 అవసరమైనప్పుడు

"అంబా" అంటే మెరుగు
ఎందుకు ఊరకే
"భౌ బౌ" మొరుగు.

30, జూన్ 2023, శుక్రవారం

22, జూన్ 2023, గురువారం

సరైనోడు

 చిత్తుకాగితాన్ని

"మామూలోడు"
నలిపి "పడేస్తాడు"
"సరైనోడు"
పడవను "చేసిపడేస్తాడు"
గాలిపటాన్ని "చేసిపడేస్తాడు"

16, జూన్ 2023, శుక్రవారం

గాలి తిరుగుళ్ళు

 ఎండకు 

గాలి తిరుగుళ్ళు తిరగటం

నీరసంతో

నీరుగారి పోవటం

అలవాటై పోయింది

మేఘానికి.




10, జూన్ 2023, శనివారం

అందర్

 "అందరి" దోషాలు కాదు

నీ "అందర్"(అండర్)
దోషాలు తెలుసుకో.

9, జూన్ 2023, శుక్రవారం

తాడోపేడో

 తాడేమోనని

తాత్సారం చేయకు

పామేమోనని

పారిపోబోకు

నిలబడి తెలివిగా

తాడో, పామో తెల్సుకో

తాడోపేడో తేల్చుకో. 


4, జూన్ 2023, ఆదివారం

ఒడి"షాక్"

 విధి శాపమా?

విధుల లోపమా?
పొగబండ్లు
కొందరి జీవితాలకు
పొగబెట్టాయి
కూత బండ్లు
కొందరి బ్రతుకులకు
కోతబెట్టాయి
ఒడిలోని వారికి
ఒడిషా లో
ఒడి"షాక్" ఇచ్చాయి.


2, జూన్ 2023, శుక్రవారం

"చండా" మార్కులు

 విద్యార్థులు కాకూడదు

"బట్టీ" విక్ర"మార్కులు"
తలిదండ్రులు కాకూడదు
"చండా" మార్కులు.

31, మే 2023, బుధవారం

27, మే 2023, శనివారం

అవ "బోకు"

 చరిత్రహీనుడవైతే

పరవాలేదు

హీన చరితుడవు 

మాత్రం అవ "బోకు". 


26, మే 2023, శుక్రవారం

శ్రమజీవి

 తెల్లటివాడు

ఎండకు తిరిగి

నల్లబడ్డాడు

చెమటలు కక్కుతున్నాడు 

శ్రమజీవి మేఘుడు.



25, మే 2023, గురువారం

ఒళ్ళు "దాచుకోకుండా"

 ఒళ్ళు దాచుకోకుండా

"పని" చేసేవారు కొందరు

ఒళ్ళు "దాచుకోకుండా"

"ఫన్" చేసేవారు కొందరు.



24, మే 2023, బుధవారం

"కవి"ట్మెంటు

 ఏపనికైనా ఉండాలి

కమిట్మెంటు

కవిత్వానికి కావాలి

"కవి"ట్మెంటు.



22, మే 2023, సోమవారం

"సెల్"కరింపు

 ఏవీ కలివిడిగా

పల్కరింపులు?
అంతా విడివిడిగా
"సెల్"కరింపులే.


19, మే 2023, శుక్రవారం

ఓవర్ టైం


ఓవర్ టైం

పనిజేయమంటే
ఎవరికైనా మంటే
నిజమే అనిపిస్తోంది
సూరుణ్ణి చూస్తుంటే.


18, మే 2023, గురువారం

"మండే"లే

 

 ఎండాకాలపు
సూర్యునికి
లేవు "సండేలు"
అన్నీ "మండే"లే

4, మే 2023, గురువారం

గోల్ద్ మెడలు

 అనుకుంటారు

కొందరు సాధించాలని
"గోల్డ్ మెడల్"
కొందరు దించాలని
మెడలో "గోల్డ్"


12, ఏప్రిల్ 2023, బుధవారం

ఆహా రమ్మని

 అమాయకపు చేపను చూస్తూ

ఎదురొస్తోంది తన ఆహారమ్మని

కొంగ, లొట్టలు వేస్తూ

పిలుస్తోంది ఆహా! రమ్మని. 


10, ఏప్రిల్ 2023, సోమవారం

9, ఏప్రిల్ 2023, ఆదివారం

ఆ పొద్దు

 

ఉదయాన్నే మేల్కొనే వారికి
నులి వెచ్చని ముద్దులు
వారిని ఆపొద్దు
ఆలస్యంగా లేచేవారికి
మండిపడే సూర్యుడి గుద్దులు
వారికి ఆ పొద్దు.

7, ఏప్రిల్ 2023, శుక్రవారం

మా "మూలే"

  


బూతుల భాషణం

మామూలైపోయింది

అర్ధనగ్న ప్రదర్శనం

మామూలైపోయింది

హత్యాచారం మామూలైపోయింది

మనిషిని నరకడం మామూలైపోయింది

సున్నితత్వమా మూలైపోయింది

మానవత్వమా మూలైపోయింది.


 

6, ఏప్రిల్ 2023, గురువారం

మూడు "ముళ్ళు"

 

సరిగా "ఉంటే"
మూడు ముళ్ళ "బంధం"
"గురి" లేకుంటే
మూడు "ముళ్ళ" బంధం.


5, ఏప్రిల్ 2023, బుధవారం

Man "Sick"

 

దురలవాట్లతో
అవుతాడు Man "Sick" - నిజం
మానాలంటే
కావాలి మానసిక బలం.


3, ఏప్రిల్ 2023, సోమవారం

నిజం

 కొందరు నిజంగా

అబద్ధం చెప్తారు

కొందరు అబద్ధాన్ని

నిజంగా చెప్తారు.



23, మార్చి 2023, గురువారం

దారి

 

విజయ సాధనకై
కొందరిది "టఫ్" దారి
కొందరిది "తప్పు" దారి


16, మార్చి 2023, గురువారం

"కపుల్"

 

చక్కగా 
సంసారం చేస్తే
వెరీగుడ్ "కపుల్"
తిక్కగా
గొడవలుపడుతుంటే
వెర్రిగొడ్డు "కపులు"


15, మార్చి 2023, బుధవారం

"నై" "పుణ్యం"

 కాయాన్ని 

కాయగూరల్లా 

ముక్కలు చేసి

"ఫ్రిజ్" లో పెడుతున్నాడు

మనిషిలో పెరిగింది

"నై" "పుణ్యం"



11, మార్చి 2023, శనివారం

"ఓటరు" భక్తుడు

"ఓటరు" ప్రజాస్వామ్య భక్తుడు

"తాయిల" ప్రసాదం తిని
"బ్యాలెట్ బాక్స్" హుండీలో
"ఓటు" కానుక వేస్తుంటాడు.


10, మార్చి 2023, శుక్రవారం

అడ్డ "గోల్"


"గోల్" కోసం

వెళ్ళే అడ్డదారి 

అడ్డ "గోల్"  దారి 

కాకుంటే సరి

అడ్డగోలు దారి. 


  


8, మార్చి 2023, బుధవారం

కలుపు మొక్క

 

తులసి వనంలో
గంజాయి కలుపు మొక్క
గంజాయి వనంలో
తులసి కలుపు మొక్క.


6, మార్చి 2023, సోమవారం

ఉండీ లేనట్టు

 



బట్ట కట్టు, ఉండీ లేనట్టు పెట్టు బొట్టు, ఉండీ లేనట్టు కండ ఫిట్టు, ఉండీ లేనట్టు భాష పట్టు, ఉండీ లేనట్టు కొందరి తీరిట్టు, ఏమి చెప్పేట్టు?



3, మార్చి 2023, శుక్రవారం

చి(చె)త్త శుద్ధి

చేయాలంటే చెత్త శుద్ధి
ఉండాలంటా చిత్త శుద్ధి
విని ఆచరిస్తే విత్త సిద్ధి
వినక వదిలేస్తే మొత్త బుద్ధి.


27, ఫిబ్రవరి 2023, సోమవారం

స్వ(ఇ)చ్ఛ

తెల్ల దుస్తుల వాళ్ళందరూ
స్వచ్ఛమైన వాళ్ళు కాదు
కాషాయం కట్టిన వాళ్ళందరూ
ఇచ్ఛ లేని వాళ్ళు కాదు.


22, ఫిబ్రవరి 2023, బుధవారం

20, ఫిబ్రవరి 2023, సోమవారం

దర్పణం

 మనవాళ్ళ తప్పులకు

కుంభాకార దర్పణం

పరాయివాళ్ళ తప్పులకు

పుటాకార  దర్పణం. 



17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

నేనే

 నేనే అంతా అనబోకు

నేనెంత అనుకోకు

నీవెంతో తెలుసుకో

నీవంతుగా మసలుకో. 




12, ఫిబ్రవరి 2023, ఆదివారం

రాంగ్ "వేలు"

 

స్మార్ట్ ఫోన్ ఒక "యోగం"
చేయకు దుర్వినియోగం
కొనడానికి "వేలు" పెట్టు
వాడటానికి వేలు పెట్టు
రాంగ్ "WAY"లలో వేలు పెట్టకు.

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

"నిల్" బెట్టు

 

పెద్దరికాన్ని
నిలబెట్టుకోవాలి
పేదరికాన్ని
"నిల్" బెట్టుకోవాలి.

4, ఫిబ్రవరి 2023, శనివారం

కళ్ళు

 

ఎదురు చూపులు
నోళ్ళు తెరుచుకొని కొందరి కళ్ళు
విలువల వలువలు
వదులుతారేమోనని ఎదుటి వాళ్ళు.


30, జనవరి 2023, సోమవారం

ధర్మం

 

ధర్మంగా 
కూడబెట్టు
ధర్మంకోసం
కూడగట్టు
ధర్మమంటూ
కూడుబెట్టు.


13, జనవరి 2023, శుక్రవారం

కా'వరము'

 చూపిస్తే

కండ కావరము

శాపమౌతుంది

దేవుడిచ్చిన వరము.

 


12, జనవరి 2023, గురువారం

నాటు


 "నీటు"గా ఉంటే
రాత,మోత,తీత
"నాటు"కుంటుంది 
అందరికీ పాట. 


8, జనవరి 2023, ఆదివారం

"కామ" న్సెన్స్

 "కామ" సెన్స్

మాత్రమే ఉంటే జంతువు

"కామన్ సెన్స్" 

కూడా ఉంటేనే మనిషి. 

7, జనవరి 2023, శనివారం

"పీస్" -"లవ్"

మనసు
"పీస్" లవకుండా 
ఉండాలి

అందుకు
"పీస్" -"లవ్" కూడా 
అందాలి. 



5, జనవరి 2023, గురువారం

4, జనవరి 2023, బుధవారం

తిట్టావో

 

 దేశాన్ని
దైవాన్నైతే
పర్వాలేదు
మా నాయకుణ్ణి
కులాన్ని తిట్టావో!