30, అక్టోబర్ 2022, ఆదివారం

పోరు

 

లెక్కల మాస్టారు
తెలుగు మాస్టారు
ఇద్దరిమధ్యా పోరు
ఒకరు వందంటే
ఒకరు పందంటారు
"పది మధ్య సున్నా పెడితే".


29, అక్టోబర్ 2022, శనివారం

భిక్షుకుడు

 

గుడి మెట్లపై 
భిక్షుకుడు
గుడి లోపల 
భక్తుడు
చేతులు జోడిస్తూ.


28, అక్టోబర్ 2022, శుక్రవారం

కలుపు

 

కలుపును కలుపుకు పోతే
కర్షకుడెలా ఔతాడు?
అరకతో అరికడితేనే
హాలికుడౌతాడు.


19, అక్టోబర్ 2022, బుధవారం

అన్ కూల్

 

కొందరికి భార్య
అనుకూలవతి
మరికొందరికి
"అన్ కూల్" వతి.


16, అక్టోబర్ 2022, ఆదివారం

"పొగ"రింగ్

 

ఇద్దరిమధ్య
"పొగ"రింగ్
కనబడిందట
"గొట్టం" పట్టుకుని
"గాలి" ఊదుతూ
"మంట" రాజేస్తూ
ఇద్దరి కొందరు
అద్దరి కొందరు.


15, అక్టోబర్ 2022, శనివారం

ఆశ

ఆశ, అదుపులో ఉంటే
దారి చూపే దీపం
మితిమీరితే
కాల్చివేసే జ్వాల.


14, అక్టోబర్ 2022, శుక్రవారం

ఉల్లిపొరల సుందరి

 

"లోపలేమీ ఉంచుకోకూడదు
బయటకు అంతా
పారదర్శకంగా ఉండాలి"
"బుల్లితెరగురువు" ప్రవచనం
థు.ఛ. తప్పకుండా
"ఉల్లిపొరలసుందరి" ప్రదర్శనం.

13, అక్టోబర్ 2022, గురువారం

టైట్-లూజ్

 

దుస్తులు 
"టైట్" గా ఉన్నా
నాలుక
"లూజ్" గా ఉన్నా
మనల్ని మనం
"బైటేసు"కోవటమే.


11, అక్టోబర్ 2022, మంగళవారం

మరో దానికోసం

 

అందంగా ఉన్నానని
మెచ్చి చేపట్టాడు
ఎప్పుడూనాతోనే
క్షణం వదిలిపెట్టడు

వేలితో తడుతూ
నావైపే చూపులు
చెంపలు ఆనించి
నాతోనే మాటలు

ఎప్పుడూ ప్రక్కనే
ఉండాలనేవాడు
నిద్ర లేవగానే నన్నే
చూడాలనుకునేవాడు

మనసెరిగిన సహచరిని
మునుపటిలా లేనని
సరిగా స్పందించటం లేదని
నన్ను వదిలి పెట్టాలనుకొని

చూస్తున్నాడు
మరో దానికోసం
నాకన్నా "మోర్ జీ.బి"
ఉన్నదానికోసం.

10, అక్టోబర్ 2022, సోమవారం

మనిషి

 

మనిషిని మనిషి 
అని పిలవాలంటే
మనిషిని మనిషిగా
ప్రక్కవాడిని చూడాలి.


8, అక్టోబర్ 2022, శనివారం

అన్నీ చూపించవచ్చు

 

 "ఆరోగ్యానికి హానికరం"
ఉంటేనే కొన్ని చూపించాలి
"సమాజానికి హానికరం"
లేకుండా అన్నీ చూపించవచ్చు.


7, అక్టోబర్ 2022, శుక్రవారం

పాత-క్రొత్త

 పాతవన్నీ

పనికిరావనుకోకు

క్రొత్తవన్నీ

కోరి తలకెత్తుకోకు.


3, అక్టోబర్ 2022, సోమవారం

ము(ప)ళ్ళచెట్టు

  

ముళ్ళచెట్టు ఆదమరిస్తే 
పెంచినవాడికీ గుచ్చుకుంటుంది
పళ్ళ చెట్టు చేరికోస్తే
పెంచనివాడికీ ఫలమిస్తుంది.