29, ఏప్రిల్ 2019, సోమవారం

"వేర్.... వేర్".

జగతివృక్షానికి భగవంతుడు "వేరు"
ఆ మూలము లేకుండా లేదు "వేరు"
లోకపు "కంప్యుటర్" లో నిండిన "సాఫ్ట్ వేర్"
వెతుకుతూ కొందరంటారు "వేర్ వేర్".

28, ఏప్రిల్ 2019, ఆదివారం

ఏ "దోచెయ్యాలని"

చిన్నదైనా పెద్దదైనా ఇల్లు
ఏ "దోచెయ్యాలని"చూస్తాయి కొందరి కళ్ళు
తలుపులు వేసున్నా నేడది  "కామ"న్
ఓరగా వేస్తావేం? జాగ్రత్త సా"మాన్".

26, ఏప్రిల్ 2019, శుక్రవారం

పచ్చగా నవ్వుతూ


భూదేవి ఓర్పు 
చెట్టుగా మొలిచినట్టుంది
ఎండవేడికి మాడుతున్నా 
పచ్చగా నవ్వుతూ నీడనిస్తోంది.

25, ఏప్రిల్ 2019, గురువారం

"సర్" వేలు

నొక్కి "చెప్పింది "
"ఓటర్ సర్" వేలు
"విన్" పడే దాకా అనేక "సర్వేలు "
ఏం చేస్తాం
సర్వేల "వే"లు వేలువేలు

23, ఏప్రిల్ 2019, మంగళవారం

ఎన్నికలంటే

ఎన్నికలంటే  
ఓటర్ల "ప్రణామ స్వీకారం" 
లీడర్ల "ప్రమాణ స్వీకారం".

22, ఏప్రిల్ 2019, సోమవారం

మధ్యవర్తి

సూర్య నారాయణుడు
భూదేవి పై మండి పడితే
చల్లబరిచే "మధ్యవర్తి"
నారద.


19, ఏప్రిల్ 2019, శుక్రవారం

13, ఏప్రిల్ 2019, శనివారం

బాయ్ - అబ్బాయ్ .

నిన్న...అమ్మా! "బాయ్" అంటే?
"అబ్బాయ్" ... బంగారుకొండా!
నేడు...మమ్మీ! "అబ్బాయ్" అంటే?
"బాయ్"...మైబాయ్!

8, ఏప్రిల్ 2019, సోమవారం

లోక్(సభ)పాలకుడు

గుడివీధి రథంపై లోకపాలకుడు
దండం పెడుతూ చుట్టూ వేలకొలది భక్తులు
నడివీధి రథంపై దండం పెడుతూ
లోక్(సభ)పాలకుడు
చుట్టూ వేలకొలది దేవుళ్ళు.

7, ఏప్రిల్ 2019, ఆదివారం

"కౌ"లను

పోషించండి
ప్రోత్సహించండి
సమాజహితం కోసం "పాలు"పడే
"కౌ"లను - కవులను

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

"అర్థం" చేసుకోకు.

ఓటు విలువ 
తెలుపుతా 
దాన్ని నమ్మి 
అర్థం చేసుకో 
దానినమ్మి 
"అర్థం" చేసుకోకు.

తెలిసి"కొంటున్నారు".

ఓటు విలువైనదన్నారు
కొందరు తెలుసుకుంటున్నారు
కొందరు తెలిసి"కొంటున్నారు".

ఓటు నీ నిధానం

ఓటు నీ నిధానం
యోగ్యుల కిచ్చుట విధానం
పాటించు నిదానం
చేయకు అపాత్ర దానం

2, ఏప్రిల్ 2019, మంగళవారం

ఎన్నిక - మన్నిక

ఏం చెప్పాలి
ఒకటారెండా ఎన్నిక
ఒకటే చెబుతా
సరిగాచెయ్ ఎన్నిక
నీ ఓటుకు ఉండాలి మన్నిక
లేకుంటే భవిషత్తు నోట మన్నిక.