బెట్టింగు బెట్టింగు బెట్టింగు
పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు గుర్రాల రేసుల్లో బెట్టింగు పేకాట జూదాలా బెట్టింగు క్రిక్కెట్టు ఆటల్లో బెట్టింగు ఎన్నికల ఫలితాలా బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు జూదాలు బాగా ఆశబెట్టింగు చేతులేమొ నీకు దురద పెట్టింగు ఉంటుంది ఆవల వల సెట్టింగు గెలుపుండదు అంత సున్న చుట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు వేశావా దానితో సిట్టింగు ఆశతో కాశావా బెట్టింగు ఉన్నసొమ్మంతా ఊడగొట్టింగు ఆస్తులన్నంటినీ కుదువా బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు పందేలు చేస్తాయా కూడు బెట్టింగు కుదిరెందెవరికి గెలిచి కూడ బెట్టింగు ఆడితె నీ భవిత పాడుబెట్టింగు కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు కట్టిపెట్టాలి చెడ్డదారిపట్టింగు చెడుస్నేహాలకు ఇవ్వరా కట్టింగు చేయాలి తెలివి పదునుబెట్టింగు మంచి త్రోవపైనా దృష్టిబెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలనీ ఫిట్టింగు ఆపరా బెట్టింగులకు పరుగు బెట్టింగు చేయరా సిట్టింగులను పడుకొబెట్టింగు నేర్వరా చెడు తలపులకు పొగబెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు బెట్టింగు బెట్టింగు బెట్టింగు పట్టుకుంటె వదలని ఫిట్టింగు ఆపరా బెట్టింగులకు పరుగు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు వద్దురా వదలరా పాడు బెట్టింగు10, మే 2025, శనివారం
బెట్టింగు
అంజనసూతీ
ఆర్త జనుల రక్షకుడే అంజనసూతీ
ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ
ఆర్త జనుల రక్షకుడే అంజనసూతీ
ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ
ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ
శ్రీరాముని భక్తులలో అగ్రగణ్యుడు
శతయోజన వార్ధి దాటిన శక్తిమంతుడు
శ్రీరాముని భక్తులలో అగ్రగణ్యుడు
శతయోజన వార్ధి దాటిన శక్తిమంతుడు
అసురుల గూల్చినా శౌర్య వంతుడు
భక్తుల బ్రోచుటలో కారుణ్య గుణవంతుడు
ధైర్యవంతుడు బుద్ధిమంతుడు హనుమంతుడూ
ఆర్త జనుల రక్షకుడే అంజనసూతీ
ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ
భూత ప్రేతముల పీడలు తొలగిపోవును
సర్వరోగముల బాధలు సమసిపోవును
భూత ప్రేతముల పీడలు తొలగిపోవును
సర్వరోగముల బాధలు సమసిపోవును
బుద్ధియు కలుగును ధైర్యము పెరుగును
పాపం మాసిపోవు సర్వకార్య జయమగును
మారుతికి మనసులో నమస్కరించగా
ఆర్త జనుల రక్షకుడే అంజనసూతీ
ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ
ఆర్త జనుల రక్షకుడే అంజనసూతీ
ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ
ఆ దేవుని నమ్మినచో లేదుర భీతీ
మహా దేవా! సదాశివా!
మహా దేవా! సదాశివా
నీకు మాకు తేడా లేదురా శంకరా
అహ నీకన్న మేమె గొప్ప హరోంహరా
అహ నీకన్న మేమె గొప్ప హరోంహరా !
మంటకన్ను ఒక్కటుంది నీకే శివా
మంటకన్ను ఒక్కటుంది నీకే శివా
మాకు రెండుకళ్ళ మంటలేరా శంకరా
మేము దేన్ని చూసి ఓర్చలేము హరోంహరా!
అహ నీకన్న మేమె గొప్పరా శంకరా
కోరిక కాల్చి బూడిద జేశావ్ నీవే శివా
కోరిక కాల్చి బూడిద జేశావ్ నీవే శివా
మా కోరికే బూడిద చేయటంరా శంకరా
మమ్ము నమ్మినోడ్ని కాల్చి వేస్తాం హరోంహరా!
అహ నీకన్న మేమె గొప్పరా శంకరా
మెడచుట్టు పాములున్నాయ్ నీకే శివా
మెడచుట్టు పాములున్నాయ్ నీకే శివా
మా తలపుట్ట నిండ పాములురా శంకరా
అవి కాటు వేయగ చూస్తూ ఉంటాయ్ హరోంహరా!
అహ నీకన్న మేమే గొప్పరా శంకరా
గొంతులోన ఇంతే విషము నీకే శివా
గొంతులోన ఇంతే విషము నీకే శివా
మాకు అంతా విషమే నిండి ఉందిరా శంకరా
మేము అక్కడ ఇక్కడ కక్కేస్తుంటాం హరోంహరా!
అహ నీకన్న మేమె గొప్పరా శంకరా
మంచీ ఎద్దు వాహనముంది నీకే శివా
మంచీ ఎద్దు వాహనముంది నీకే శివా
మా బుద్ధే ఎద్దూ లాంటిదిగదరా శంకరా
దాన్ని వదలక పట్టి తిరుగుతుంటాం హరోంహరా!
అహ నీకన్న మేమె గొప్పరా శంకరా
ఏనుగుతోలు తీసికట్టావు నీవే శివా
ఏనుగుతోలు తీసికట్టావు నీవే శివా
మా పోటీ గాడికి తోలు తీస్తాంరా శంకరా
మమ్మెదిరిస్తే వాడి తాటతీస్తాం హరోంహరా
అహ నీకన్న మేమె గొప్పరా శంకరా
అన్నీ తెలిసిన తెలివి ఉంది నీకే శివా
అన్నీ తెలిసిన తెలివి ఉంది నీకే శివా
మాకు అంతకన్నా ఎక్కువ తెలివిరా శంకరా
ఎంతో అతితెలివి మాకే ఉంది హరోంహరా!
అహ నీకన్న మేమె గొప్పరా శంకరా
ఎవరు ఎక్కువో తెలుసుకుందాం రారా శివా
ఎవరు ఎక్కువో తెలుసుకుందాం రారా శివా
మా గుండెలె కొలువూ చక్కగ నీవే రా శంకరా
నిన్నూ కొలిచీ కొలిచీ చూసుకుంటాం హరోంహరా
నిన్నూ కొలిచీ కొలిచీ చూసుకుంటాం హరోంహరా!
రామయ్యా ఓ రామయ్యా
రామయ్యా ఓ రామయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
రామయ్యా ఓ రామయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
నిన్నే వీడక రామయ్యా
మది వేడితిమయ్యా రామయ్యా
రామయ్యా ఓ రామయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
దశరథ సుతుడవు నీవటా
దశకంఠుని గూలిచి నావటా
దశరథ సుతుడవు నీవటా
దశకంఠుని గూలిచి నావటా
దశదిశలను నిండినావటా
రామయ్యా ఓ రామయ్యా
దశదిశలను నిండినావటా
రామయ్యా ఓ రామయ్యా
మాజీవితాన మంచి దశలందించగ రావయ్యా!
మాజీవితాన మంచి దశలందించగ రావయ్యా!
రామయ్యా ఓ రామయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
వరగుణముల రాజువు నీవటా
వరజాతయె నీకే సతియటా
వరగుణముల రాజువు నీవటా
వరజాతయె నీకే సతియటా
వరదుడను పేరు నీదటా
రామయ్యా ఓ రామయ్యా
వరదుడను పేరు నీదటా
రామయ్యా ఓ రామయ్యా
నీదయ మాపై వరలెడునటు వరమీవయ్యా
నీదయ మాపై వరలెడునటు వరమీవయ్యా
రామయ్యా ఓ రామయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
నిన్నే వీడక రామయ్యా
మది వేడితిమయ్యా రామయ్యా
రామయ్యా ఓ రామయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
మముబ్రోవగ వేగమె రావయ్యా
26, ఏప్రిల్ 2025, శనివారం
చావాలీ ఉగ్ర వాదం
చావాలీ ఉగ్ర వాదం
మోపాలీ ఉక్కుపాదం
చెప్పిందీ భరత మాత
పట్టాలీ భరతమంట //చావాలీ//
కాశ్మీరూ చూడమంటా
భూతల స్వర్గమ్మదంటా
భూతాలే చొరబడెనంటా
నరకమ్మే చూపెనంటా //చావాలీ//
పెహ్లాగావ్ లోనా టెర్రర్
టూరిస్టుల కొకటే హర్రర్
దాయాదుల మరియొక ఎర్రర్
చూపెను ఈ ఘటనొక మిర్రర్ //చావాలీ//
దుర్మార్గుల సాయుధ దాడీ
చూశారే ఫుల్లుగ బాడీ
వేరేమతమంటూ రూఢీ
మరుక్షణమే అది డెడ్ బాడీ //చావాలీ//
చలిలోనా మరిగే రక్తం
చెల్లదు మరి శాంతి సూక్తం
సలపాలీ తక్షణ యుక్తం
చేయాలీ మన శక్తిని వ్యక్తం //చావాలీ//
చావాలీ ఉగ్ర వాదం
మోపాలీ ఉక్కుపాదం
చెప్పిందీ భరత మాత
పట్టాలీ భరతమంట
6, ఏప్రిల్ 2025, ఆదివారం
రామా! శ్రీ రామా!
రామా!రామా! హేరామా!
మా మొరలే వినుమా రామా!
సీతారామా! శ్రీరామా!
మమ్మేలగ నీకిక మారామా?
రామా!రామా! హేరామా!
మా మొరలే వినుమా రామా!
సీతారామా! శ్రీరామా!
మమ్మేలగ నీకిక మారామా?
సీతారామా! శ్రీరామా!
మమ్మేలగ నీకిక మారామా?
ఉదయమ్మాయెను వేచిరి భక్తులు
ఇనకుల తిలకా లేవయ్యా
ఉదయమ్మాయెను వేచిరి భక్తులు
ఇనకుల తిలకా లేవయ్యా
విడు నీమాయను నిద్దుర మత్తులు
నీ ముఖమందున లేవయ్యా
విడు నీమాయను నిద్దుర మత్తులు
నీ ముఖమందున లేవయ్యా
రామా!రామా! హేరామా!
మా మొరలే వినుమా రామా!
సీతారామా! శ్రీరామా!
మమ్మేలగ నీకిక మారామా?
నిను మదిదలతుము వీడక గొల్తుము
నెమ్మది నింపగ రావయ్యా
నిను మదిదలతుము వీడక గొల్తుము
నెమ్మది నింపగ రావయ్యా
నువు దరి నిలచిన కరుణను జూపిన
మాకిక బాధలు రావయ్యా
నువు దరినిలచిన కరుణను జూపిన
మాకిక బాధలు రావయ్యా
రామా!రామా! హేరామా!
మా మొరలే వినుమా రామా!
సీతారామా! శ్రీరామా!
మమ్మేలగ నీకిక మారామా?
మా భారము నీదయ చూపుము నీ దయ
ఇంకా జాలమ్మేలయ్యా
మా భారము నీదయ చూపుము నీ దయ
ఇంకా జాలమ్మేలయ్యా
నిను కీర్తించే భాగ్యము మాదయ
మేలుకొనీ మమ్మేలయ్యా
నిను కీర్తించే భాగ్యము మాదయ
మేలుకొనీ మమ్మేలయ్యా
రామా!రామా! హేరామా!
మా మొరలే వినుమా రామా!
సీతారామా! శ్రీరామా!
మమ్మేలగ నీకిక మారామా?
మా మొరలే వినుమా రామా!
మమ్మేలగ నీకిక మారామా?
మా మొరలే వినుమా రామా!
మమ్మేలగ నీకిక మారామా?
2, ఏప్రిల్ 2025, బుధవారం
ఉగాది (గేయం)
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగా ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగా ఉగాదీ
పెందలకడ లేస్తేనే ఉగాదీ
వదలక తలస్నానం చేస్తేనే ఉగాదీ
దీపాన్నీ వెలిగిస్తే ఉగాదీ
పిదపదైవాన్నీ పూజిస్తే ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసి జరపాలీ గర్వముగా ఉగాదీ
వేపపూత పచ్చడుంటె ఉగాదీ
పిందెమామిళ్ళూ కలుపుకుంటె ఉగాదీ
ఆరు రుచులు సరికుదిరితె ఉగాదీ
దాన్ని అరచేతను వేసితింటె ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగా ఉగాదీ
పులిహోరను చేసుకుంటె ఉగాదీ
మరీ పరమాన్నం మరువకుంటె ఉగాదీ
పిండివంట వండుకుంటె ఉగాదీ
తెలుగు భోజనమే తినిత్రేంచితె ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసి జరపాలీ గర్వముగా ఉగాదీ
చైత్రాదుల నెరిగుండుట ఉగాదీ
ఋతువులారిటినీ సరితెలియుట ఉగాదీ
వత్సరముల పేర్లరయుట ఉగాదీ
కాలగతి తెలిసి నడచుకొనుట ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసిజరపాలీ గర్వముగాఉగాదీ
తెలుగుతీపి చవిజూచుట ఉగాదీ
తెలుగు వెలుగులను తలచుకొనుట ఉగాదీ
తెలుగుతల్లి బిడ్డనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ
తెలుగువారి మొదటి పర్వముగాదీ
తెలిసి జరపాలీ గర్వముగా ఉగాదీ
తెలుగుతల్లి బిడ్డనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ
నేను తెలుగునెపుడు మరువనంటె ఉగాదీ
22, మార్చి 2025, శనివారం
కవిత్వమంటే
కవిత్వమంటే కవిత్వమంటే
కవిత్వమంటే కవిత్వమంటే
కవిత్వమంటే ఒక యోగం
కవిత్వమంటే ఒక యాగం
కవిత్వమంటే ఒక యానం
కవిత్వమంటే ఒక ధ్యానం
కవిత్వమంటే ఒక స్నేహం
కవిత్వమంటే ఒక మోహం
కవిత్వమంటే కవిత్వమంటే
కవిత్వమంటే ఒక శక్తి
కవిత్వమంటే ఒక యుక్తి
కవిత్వమంటే ఒక కత్తి
కవిత్వమంటే ఒక రక్తి
కవిత్వమంటే ఒక భక్తి
కవిత్వమంటే ఒక భుక్తి
కవిత్వమంటే కవిత్వమంటే
కవిత్వమంటే ఒక రవ్వ
కవిత్వమంటే ఒక చివ్వ
కవిత్వమంటే ఒక గువ్వ
కవిత్వమంటే ఒక మువ్వ
కవిత్వమంటే ఒక నవ్వు
కవిత్వమంటే ఒక పువ్వు
కవిత్వమంటే కవిత్వమంటే
కవిత్వమంటే ఒక విందు
కవిత్వమంటే ఒక మందు
కవిత్వమంటే ఒక సూది
కవిత్వమంటే ఒక దూది
కవిత్వమంటే ఒక ధుని
కవిత్వమంటే ఒక గని
కవిత్వమంటే కవిత్వమంటే
కవిత్వమంటే ఒక దివి
కవిత్వమంటే ఒక చవి
కవిత్వమంటే ఒక రవి
కవిత్వమంటే ఒక పవి
కవిత్వమంటే ఒక తావి
కవిత్వమంటే ఒక భావి
కవిత్వమంటే కవిత్వమంటే
కవిత్వమంటే ఒక జపం
కవిత్వమంటే ఒక తపం
కవిత్వమంటే ఒక ఫలం
కవిత్వమంటే ఒక బలం
కవిత్వమంటే ఒక మానం
కవిత్వమంటే ఒక జ్ఞానం
కవిత్వమంటే ఒక జ్ఞానం
కవిత్వమంటే ఒక ధ్యానం
కవిత్వమంటే ఒక యోగం
కవిత్వమంటే ఒక యాగం
14, మార్చి 2025, శుక్రవారం
హోలీ హోలీ హోలీ
హోలీ హోలీ హోలీ
పలు రంగులతో రంగేళీ
హోలీ హోలీ హోలీ
పలు రంగులతో రంగేళీ
ఫాల్గున పౌర్ణమి హోలీ
హోలిక రాక్షసి దహనం హోలీ
కాముని పున్నమి హోలీ
కృష్ణ రాసలీలలే హోలీ
ఫాల్గున పౌర్ణమి హోలీ
హోలిక రాక్షసి దహనం హోలీ
కాముని పున్నమి హోలీ
కృష్ణ రాసలీలలే హోలీ
హోలీ హోలీ హోలీ
ఉభయ సంధ్యలలో నింగీ
సూర్యుని రంగులాటలే హోలీ
నలుపు తెలుపు మేఘాలూ
ఆకాశపుటాటలె హోలీ
ఉభయ సంధ్యలలో నింగీ
సూర్యుని రంగులాటలే హోలీ
నలుపు తెలుపు మేఘాలూ
ఆకాశపుటాటలె హోలీ
హోలీ హోలీ హోలీ
పలు రంగులతో రంగేళీ
చిరుజల్లుల వేళల పట్టే
హరివిల్లు పూతలే హోలీ
భూమిపైన వెదజల్లే
పలుపూవుల జల్లులె హోలీ
చిరుజల్లుల వేళల పట్టే
హరివిల్లు పూతలే హోలీ
భూమిపైన వెదజల్లే
పలుపూవుల జల్లులె హోలీ
హోలీ హోలీ హోలీ
పలు రంగులతో రంగేళీ
తెల్లని మదితెర పైన
మనిషి రంగులకలలే హోలీ
కృషితో అవినిజమైతే
తన జీవితమంతా హోలీ
హోలీ హోలీ హోలీ
పలు రంగులతో రంగేళీ
తెల్లని మదితెర పైన
మనిషి రంగులకలలే హోలీ
కృషితో అవినిజమైతే
తన జీవితమంతా హోలీ
హోలీ హోలీ హోలీ
పలు రంగులతో రంగేళీ
హోలీ హోలీ హోలీ
పలు రంగులతో రంగేళీ
12, మార్చి 2025, బుధవారం
పిల్లలు పిల్లలు పిల్లలు
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
ఇంటికి బంగరు కొండలూ
తలిదండ్రుల మెత్తని గుండెలూ
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
కళ్ళు చూస్తే వెలిగేటి దివ్వెలు
బుగ్గలేమో లే గులాబీ పువ్వులు
నోటినిండా అహ బోసీ నవ్వులూ
ఎగరలేని పసి తారాజువ్వలూ
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
నడకొస్తే కుందేటీ పిల్లలు
మాటొస్తే పూతేనె జల్లులు
ఏడిస్తే ఆకాశం చిల్లులు
ఆడిస్తే ఎవరెస్టూ హిల్లులు
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
వదిలేస్తే తోకలేని కోతులూ
అదిలిస్తే చాలు బుంగ మూతులూ
మూడొస్తే గోడమీద గీతలూ
కనిపిస్తయ్ మోడ్రనార్టూ రీతులూ
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
ఇవ్వాలీ ఎన్నెన్నో ముద్దులూ
నింపాలీ తలనిండా బుద్ధులూ
తినిపించాలీ చిరుకోపపు గుద్దులూ
నేర్పించాలీ మరి సుద్దులూ హద్దులూ
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
చూపించాలి సంస్కారపు దారులూ
అందించాలి విజ్ఞానపు కారులూ
కాకుండా ఉండాలి చోరులూ
కావాలీ భావికి సరి పౌరులూ
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
ఇంటికి బంగరు కొండలూ
తలిదండ్రుల మెత్తని గుండెలూ
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
పిల్లలు పిల్లలు పిల్లలు
వసివాడని తెల్లని మల్లెలు
8, మార్చి 2025, శనివారం
మహిలోనా దేవతరా మహిళా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు.
ఆ సందర్భంగా నేను వ్రాసిన పాట.మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
లోకమ్మున కల్పతరువు మహిళా
ఇంతి రూపమ్మున ఇంటి పరువు మహిళా
బ్రహ్మయ్యకు మారురూపు మహిళా
వాని కన్నయ్యకు దార రూపు మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
పసివారికి పాలబువ్వ మహిళా
సరి మగనికి ఎద గూటిగువ్వ మహిళా
తనవారికి నెనరు మువ్వ మహిళా
మరి పగవారికి నిప్పురవ్వ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
లాలిస్తే పూలతీగ మహిళా
తాను కోపిస్తే కందిరీగ మహిళా
ద్వేషిస్తే గ్రద్ద డేగ మహిళా
మెచ్చి ప్రేమిస్తే ముద్దు లేగ మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
పురుషునికందిన యోగం మహిళా
తల్లి అగుటకూ ఘనత్యాగం మహిళా
కాదనుకో ఇల భోగం మహిళా
ఆగం కాకూడని ఒక యాగం మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
మహిలోనా దేవతరా మహిళా
మహితహితకారిణి సుదతి సుమతి మహిళా
1, ఫిబ్రవరి 2025, శనివారం
తెలుగు "వాడి" పద్యం - పాట
రవళి మాసపత్రిక ఫిబ్రవరి 2025 సంచికలో ప్రచురితమయిన నేను వ్రాసిన పాట.
తెలుగు "వాడి" పద్యం - పాట
_________________________
ఉత్పలమాల:
వీడక తెల్గునెప్పుడును వీడుల వాడల ప్రీతి బల్కుమా!
వాడకనున్నవేళ నది వాడునుగా, మన భాష వాడుమా!
వాడుచు నందులోనగల వాడి గ్రహించుచు, తెల్గువాడివై
వాడును వీడు మెచ్చగను, వాడెద నేనని బాస జేయుమా!
========================================
పల్లవి:
తెలుగువాడినని చెప్పూ తెలుగు వాడీ
తెలుపుమా నలుగురికీ తెలుగు వాడీ
వాడి తెలుపుమా నలుగురికీ తెలుగు వాడీ.
చరణం:
వాడవాడలా వదలక వాడాలని చెప్పు
వాడకుంటె వెర్రివాడ వాడుతుందని చెప్పు
వాడవాడలా వదలక వాడాలని చెప్పు
వాడకుంటె వెర్రివాడ వాడుతుందని చెప్పు
వాడువీడు రావాలీ పుట్టివేడీ
వీడు వాడినాపొద్దూ వేడివేడీ
నిన్ను వీడు వాడినాపొద్దూ వేడివేడీ
వాడు తెలుగువాడు కాడురా తెగులు రౌడీ //తెలుగువాడి//
చరణం:
మమ్మి డాడి అంకులాంటి మనవిగావని చెప్పు
అమ్మ నాన్న యనరా నా మనవిరా యని చెప్పు
మమ్మి డాడి అంకులాంటి మనవిగావని చెప్పు
అమ్మ నాన్న యనరా నా మనవిరా యని చెప్పు
అన్న అక్క చెల్లెలనీ అన్నవాడే
మామ అత్త అంటే సుమా మనోడే
అహ మామ అత్త అంటే సుమా మనోడే
తెలుగు వాడువాడు వాడేలే తెలుగు వాడే //తెలుగువాడి//
చరణం:
అక్షరాలు ఏబదారు వదలరాదని చెప్పు
బరువననుచు వదలగా పరువుగాదని చెప్పు
అక్షరాలు ఏబదారు వదలరాదని చెప్పు
బరువననుచు వదలగా పరువుగాదని చెప్పు
అౘ్చులన్ని నేర్వాలీ అౘ్చగానే
హల్లులన్ని పలకాలి హాయిగానే
అహ హల్లులన్ని పలకాలి హాయిగానే
శా,షా ,సా,ళా,లా అని చక్కగానే //తెలుగువాడి//
చరణం:
చాఛాలు జాఝాలు చాలవులే అనిచెప్పు
మధ్యలోన ౘా ౙాలు ఉన్నవిలే అని చెప్పు
చాఛాలు జాఝాలు చాలవులే అనిచెప్పు
మధ్యలోన ౘా ౙాలు ఉన్నవిలే అని చెప్పు
చాప, చూపు, జున్ను, జొన్న లనతప్పురా
ౘాప, ౘూపు, ౙున్ను, ౙొన్న లననొప్పురా
ఒహొ ౘాప, ౘూపు, ౙున్ను, ౙొన్న లననొప్పురా
అనలేకుంటే ౘౘ్చుగుౙ్జు పుచ్చె నీదిరా //తెలుగువాడి//
చరణం:
సుమతి శతక పద్యాలను చూచి నేర్వమని చెప్పు
వేమనకవి ఆటవెలదు లన్ని చదవమని చెప్పు
సుమతి శతక పద్యాలను చూచి నేర్వమని చెప్పు
వేమనకవి ఆటవెలదు లన్ని చదవమని చెప్పు
లోకరీతి తెలుపుతాయి అన్ని చేరి
బ్రతుకునందు చూపుతాయి మంచి దారి
మనకు బ్రతుకునందు చూపుతాయి మంచి దారి
అరె చిన్ననాట నేర్చిందే నిలుచునోరి //తెలుగువాడి//
23, జనవరి 2025, గురువారం
స్వతంత్రం అంటే (గేయం)
అమరావతి సాహితీ మిత్రులు, లో తేది:11-01-2025 ఇచ్చిన అంశము నకు నేను వ్రాసిన గేయం.
అంశం:స్వతంత్రం
స్వతంత్రం అంటే (గేయం)
కావాలీ కావాలీ స్వతంత్రం
అందరికీ కావాలీ స్వతంత్రం
కావాలీ కావాలీ
అందరికీ కావాలీ
పరిమితిలో ఉండాలీ స్వతంత్రం
ఎపుడూ హద్దు మీరకుండాలీ స్వతంత్రం //కావాలీ//
మతం మత్తు కాదురా స్వతంత్రం
కులం గొడవ కాదురా స్వతంత్రం
మతం మత్తు కాదురా
కులం గొడవ కాదురా
హెచ్చు తగ్గు లేనిదే స్వతంత్రం
అంతా కలసి మెలసి ఉండేదే స్వతంత్రం //కావాలీ//
దోపిడీలు కాదురా స్వతంత్రం
దుర్మార్గం కాదురా స్వతంత్రం
దోపిడీలు కాదురా
దుర్మార్గం కాదురా
శాంతితోడ మెలిగేదే స్వతంత్రం
అంతా హింసలేక ఉండేదే స్వతంత్రం //కావాలీ//
బూతు మాట కాదురా స్వతంత్రం
చెంప వేటు కాదురా స్వతంత్రం
బూతు మాట కాదురా
చెంప వేటు కాదురా
సద్విమర్శ చేసేదే స్వతంత్రం
ఎంతో సహనంతో ఉండేదే స్వతంత్రం //కావాలీ//
చెడు తిరుగుడు కాదురా స్వతంత్రం
అలసత్వం కాదురా స్వతంత్రం
చెడు తిరుగుడు కాదురా
అలసత్వం కాదురా
జ్ఞానాన్నీ పొందటమే స్వతంత్రం
విజ్ఞానంతో ఎదగటమే స్వతంత్రం //కావాలీ//
విప్పుకొనుట కాదురా స్వతంత్రం
నిండు ముసుగు కాదురా స్వతంత్రం
విప్పుకొనుట కాదురా
నిండు ముసుగు కాదురా
మనిషిగా మసలుకొనుట స్వతంత్రం
మంచీ మర్యాదగ నడచుకొనుట స్వతంత్రం //కావాలీ//
అవినీతీ కాదురా స్వతంత్రం
విలాసాలు కాదురా స్వతంత్రం
అవినీతీ కాదురా
విలాసాలు కాదురా
తృప్తి తోడ జీవించుట స్వతంత్రం
మరి నలుగురికీ సాయపడుట స్వతంత్రం //కావాలీ//
17, జనవరి 2025, శుక్రవారం
తెలుగుపల్లె లేచింది (గేయం)
అమరావతి సాహితీ మిత్రులు గ్రూప్ లో ఇచ్చిన (తేది:5-01-2025) కవిత అంశానికి నేను వ్రాసిన గేయం.
తెల్లావారకముందే తెలుగుపల్లె లేచిందీ