30, జులై 2018, సోమవారం

ఉత్సాహంగా "ఉరికి"


Image result for rape and murderఅత్యాచారి ముదిరి హత్యాచారి
అవుతున్నాడు జాగ్రత్తమరి
పాపంచేస్తున్నాడు ఉత్సాహంగా ఉరికి
ఏమాత్రం వెరవట్లేదుకూడా ఉరికి.

27, జులై 2018, శుక్రవారం

నిండుచంద్రుడైనా


Image result for moon phases
ఇరవైఏడు నక్షత్రాల ఆకాశహర్మ్యంలో    
ఉండే నిండుచంద్రుడైనా 
కదలే  కాలానికి "చిక్కాల్సిందే" 
చీకట్లో కలిసి  "పోవాల్సిందే".

26, జులై 2018, గురువారం

వాటర్ లోన్


Image result for sun and river
సముద్రంబ్యాంక్ నుండి "వాటర్ లోన్" 
భూమి "ఎకౌంట్ బుక్స్" మేఘాల్లోకి 
"ట్రాన్స్ ఫర్" చేస్తుంటాడు సూర్యుడు 
నదులద్వారా జరుగుతుంది"రీపేమెంట్"

23, జులై 2018, సోమవారం

పండుకొని


Image result for fruits
అమృత ఫలాలను  చేస్తున్నారు 
రసాయనాలతో విషతుల్యం
మనం ఏం చేస్తాం 
పండుకొని పండ్లుకొరకటం తప్ప.

18, జులై 2018, బుధవారం

దేవుళ్ళాట


Image result for meditationబయటి దేవుళ్ళకోసం దేవుళ్ళాటా?
వదలు..అది దేవుళ్ళాట
అందరు దేవుళ్ళ కొలువు
నీమనసులోనే...వెదకి కొలువు.

17, జులై 2018, మంగళవారం

మెరుపుసమ్మె


Image result for raining clouds

సూర్యుడు కాల్చుకు తింటున్నాడని
గర్జిస్తూ మేఘాల మెరుపుసమ్మె
గాలి కొట్టిన దెబ్బలతో
చెల్లాచెదురై నీరుగారిపోయింది.

16, జులై 2018, సోమవారం

"సెల్ " ఫిష్


Image result for cell phone


మనిషి ఎప్పటినుండో
"సెల్ఫిష్:"
ఇప్పుడు
"సెల్ " ఫిష్ కూడా.


15, జులై 2018, ఆదివారం

చినుకుబిడ్డ


Image result for thunder rain dropనిండు గర్భిణిలా నల్లమబ్బు
పురిటి వేదనలా ఉరుము
మెరుపు శస్త్రచికిత్స తో 
భూమ్మీద పడ్డ
ది చినుకుబిడ్డ.

సెల్లుల్లోకి దించుతూ.


Image result for group cellphone video shootingచావుబ్రతుకుల్లో నమస్కరిస్తూ
రెండుచేతులు - చుట్టూ వందచేతులు
సాయాన్ని అందించుతూ కాదు
దృశ్యాన్ని సెల్లుల్లోకి దించుతూ.

14, జులై 2018, శనివారం

"కలువనంటే"


Image result for kaluva bud images
జ్ఞాన రవికిరణాలతో
"కలువనంటే"
హృదయానికి
వికాసమేముంటుంది.

13, జులై 2018, శుక్రవారం

'నీట్' మేఘంImage result for clouds

నీటుగానుండే తెల్లటి మేఘం
మోటుగా ఎండనబడి నల్లబడింది
చేటుగలగకుండా లోకానికి
నీటిని చల్లగా అందించాలని.


11, జులై 2018, బుధవారం

భక్త "వరదా!"


Image result for sunstroke and cyclone image

నిన్నటి  ఎండలకు మనం - 
వానలు కురిపించు భక్తవరదా! 
రేపటి వానలకూ మనమే -  
స్వామీ ఇంత వరదా!

10, జులై 2018, మంగళవారం

వేళ్ళూకళ్ళు


Image result for playing video game image


కనీసం కుందుళ్ళు దుముకుళ్ళు 
ఆడితే కదులుతుంది ఒళ్ళు
వీడియోగేంతో కదిలించే వేళ్ళూకళ్ళు
వేస్తాయి ఆరోగ్యానికి సంకెళ్ళు.

8, జులై 2018, ఆదివారం

"పాపు"లరు


Image result for sree rama imagesపూజిస్తే "పుణ్య"శీలురు
ద్వేషిస్తే "పాపు"లరు
అదే రాముని "పవరు" 

5, జులై 2018, గురువారం

మాయల "ఫకీర్లు"


Image result for mayala fhakeer

"కామదర్శిని" మాయాదర్పణం లోచూసి
బాలనాగమ్మను చెరబట్టాడు "మాయలపకీరు"
జాగ్ర త్త - బాలలూ, నాగమ్మలూ
ఇప్పుడెందరో "కామదర్శిని"తో "ఫకీర్లు".


4, జులై 2018, బుధవారం

ఫేసు - బుక్కు


Image result for cell phone in book

వాడి ఫేసు ముందు బుక్కు
అందులోకే ఉంది లుక్కు
చూసేది "ఫేసు బుక్కు"
తండ్రి గుండె కలుక్కు.3, జులై 2018, మంగళవారం

వేడితే "నీరు"


Image result for hot tea image

కొందరు- 
పేదవారికి ఇవ్వరు 
వేడితే "నీరు"  
పెద్దలు కూడితే చాలు
వేడి "తేనీరు"   

2, జులై 2018, సోమవారం

"ఆంటీకి" ఆ "హారం"


Image result for telugu talli images
మొదట  తెలుగు "తల్లికి" 
అందించు ఆదరణల "ఆహారం"
ఆపైనే ఇంగ్లీషు "ఆంటీకి" 
మెడనుంచు మో(క్రే)జుల ఆ "హారం"