28, డిసెంబర్ 2023, గురువారం

క(ల)వరింగ్

 ఉండాలి సరియైన కవరింగ్

విత్ "విష్"టమైన కలరింగ్
'ఫోను' కు డస్ట్ ప్రూఫ్
'మేను' కు దృష్టి ప్రూఫ్


24, డిసెంబర్ 2023, ఆదివారం

"విల్"సిల్లు

 "అప్పు"లేని ఇల్లు

"ఆప్" లున్న సెల్లు
గొప్పగా "విల్"సి
ల్లు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

మారిపోతుంది

 ఎక్కడ వత్తాలో 

ఎక్కడ ఆపాలో 

తెలియకపోతే

మాట అర్థం 

మారిపోతుంది 


ఎక్కడ తగ్గాలో

ఎక్కడ నెగ్గాలో

తెలియకపోతే

జీవన గమనం

మారిపోతుంది.



20, డిసెంబర్ 2023, బుధవారం

"నిల్" పడేట్లు

 సాహిత్యం, సంగీతం, గానం

కలిసి పాటను కలకాలం
నిలబడేట్లు చేయాలి
"నిల్" పడేట్లు కాదు.

19, డిసెంబర్ 2023, మంగళవారం

తెలుగు "వాడి"

 తెలుగువాడిది ఒకటే మాట

"తెలుగువాడ" నని 

గర్వంగా అనటం

తెలుగు "వాడనని"

గర్వంగా అనటం

అది తెలుగు "వాడి"కే చెల్లింది.



15, డిసెంబర్ 2023, శుక్రవారం

"గీత" కార్మికుడు

 నేడు "బాపు" గారి జన్మదినం సందర్భంగా....


తెలుగువారి మనసులకు
ఆహ్లాదపు "మత్తును"
అలవాటు చేసిన
"గీత" కార్మికుడు
మన "బాపు"


13, డిసెంబర్ 2023, బుధవారం

భోజ(న) రాజు

 ఏరీ! నాటి

కృష్ణ రాయలు

భోజరాజులు?


నేడు ఉన్నారు

తృష్ణ రాయలు

భోజన రాజులు


10, డిసెంబర్ 2023, ఆదివారం

లో "కన్ను"

 మనిషికి ముఖ్యం

లోకమును 

తెలుసుకోవటం 

లో కన్ను 

తెరుచుకోవటం.


8, డిసెంబర్ 2023, శుక్రవారం

క్రియేటర్

 మనిషిగా పుట్టి

కాకూడదు కేవలం "ఈటర్"

అవకూడదు అసలే "ఛీటర్"

అవాలి చరిత్ర "క్రియేటర్" 

7, డిసెంబర్ 2023, గురువారం

నవ్వేడేస్

 ఉరుకులు పరుగులు

అందోళనతో "నౌ ఎ డేస్"


మలచుకుంటే వాటిని

అవుతాయి "నవ్వేడేస్"



6, డిసెంబర్ 2023, బుధవారం

ముద్ద

 ఆకాశం మూకుడులో, నల్లనయ్య 

పంచటానికి దాచుకున్న 

వెన్న ముద్ద-పున్నమ చంద్రుడు

నింగి పళ్ళెంలో, ప్రకృతికాంత 

పారాణికోసం కలుపుకున్న 

పసుపు,సున్నం ముద్ద - పడమటి సూర్యుడు.