29, అక్టోబర్ 2019, మంగళవారం

'వన్ డే' పదార్థాలు.

ఎగబడి తినకు
బయట 'వండే' పదార్థాలు
నిలవున్నవి కాకుండా
ఇంటతిను 'వన్ డే' పదార్థాలు.
25, అక్టోబర్ 2019, శుక్రవారం

ధర

ధరపై పంటవేసి
రైతు చూపు ఆకాశంలోకి
పంట ధర భూమిలోకి
రైతు ఆకాశంలోకి.


22, అక్టోబర్ 2019, మంగళవారం

బారులు

బారులు దీరి మందులకోసం 
ఆస్పత్రి వద్ద రోగులు
బారుల వద్ద 'మందుల' కోసం
ఆతృతతో భావి రోగులు.


19, అక్టోబర్ 2019, శనివారం

"హోపిక"

జీవన పోరాటానికి 
పెంచుకోవాలి ఓపిక 
గెలిచి తీరుతామని
ఉంచుకోవాలి "హోపిక". 


14, అక్టోబర్ 2019, సోమవారం

నాగరికం.

చిరుగుల  దుస్తులు 
కట్టుకొని ఉంటే 
పేదరికం
కొని కట్టుకుంటే 
నాగరికం.


.


4, అక్టోబర్ 2019, శుక్రవారం

"SAVE" ఇస్తాయి.

దైవాన్ని, ఔషధాన్ని
నమ్మకంతో "సేవిస్తే"
తగిన విధంగా నీకు
తప్పక "SAVE" ఇస్తాయి.

3, అక్టోబర్ 2019, గురువారం

అమృతాంజనం

వినబడే పాటలు
రెండు రకాలు
అమృతం పోసేవి
అమృతాంజనం పూసేవి.

1, అక్టోబర్ 2019, మంగళవారం

'ఫోటో' కి దండ

'సెల్ఫీ' ఫోటో  తీసుకో
నీ 'ఫోటో' కి దండ 
పడకుండా  చూసుకో.