28, డిసెంబర్ 2021, మంగళవారం

"పుల్"కాలు

 

పుస్తకాలు
కొందరి దృష్టిలో
"పుష్"కాలు
కొందరి దృష్టిలో
"పుల్"కాలు.25, డిసెంబర్ 2021, శనివారం

ఓ...మికరానుగా

 

మా టీ"కాలు" దెబ్బకు
నేనిక రానుగా
అంటూ పోయావనుకున్నా
"ఓమికరానుగా"
మళ్ళీ వస్తున్నావుగా.


22, డిసెంబర్ 2021, బుధవారం

హద్దు

 

తుప్పులాంటి మనిషిని
పిలువకు, వద్దకు రానీకు
ఉప్పులాంటి మనిషిని
వదలకు, హద్దులో ఉంచు
నిప్పులాంటి మనిషిని
మరువకు, హద్దులో ఉండు.

వేస్టే

 

పన్నీటి చుక్క
బూడిదలో వేస్తే!
ఏమిటి తిక్క
బూడిదలో "వేస్టే"

పోటు

 

జీవితమంటే
ఆటు పోటు
తట్టుకోకుంటే
హార్టు పోటు.


6, డిసెంబర్ 2021, సోమవారం

కవి "తంట"

 

తపన తో పడాలి
ప్రతి కవి "తంట"
అప్పుడే పుడుతుంది
మంచి కవితంట.


4, డిసెంబర్ 2021, శనివారం

మా"స్టారు"

 


సంగీత ప్రపంచంలో
ఎందరో "స్టార్లు"
అందులోప్రత్యేకం
మన ఘంటసాల "మాస్టారు"


1, డిసెంబర్ 2021, బుధవారం

ఆయన సిరా వెన్నెల

 సిరి వెన్నెల... ఆయన సిరా వెన్నెల

వారికి నా నివాళులు
జగమంత కుటుంబం
ఏకాకి అయ్యింది
సిరి వెన్నెల లేక
సినీ వినీలాకాశం
మసకబారింది