29, జులై 2014, మంగళవారం

సొల్లు ఫోను
నేడు ఎవరి చేతిలో చూసినా  సెల్లు ఫోను
అతిగా మాట్లాడితే  అదే  సొల్లు ఫోను
చివరకు చూసుకుంటే జేబుకు  చిల్లు ఫోను            
కొందరి వద్ద ఎప్పుడూ ఔటుగోయింగు  నిల్లు ఫోను

విద్యార్థుల చదువుకు తూట్లు పొడిచే ముల్లు ఫోను
అకతాయిలకు ఆడపిల్లలను తరచుగా గిల్లు ఫోను
మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారిపాలిట  హెల్లు ఫోను
నేర నిర్ధారణలో చట్టానికి  యూజుఫుల్లు ఫోను

 
ప్రేమికులకు చాటు భాషణల తేనెల జల్లు ఫోను
దేశాంతరంలో  ఉన్న  వాని చేతిలో యిల్లు ఫోను
నిద్ర లేపటానికి ట్రీంగ్ ట్రింగ్ అలారం బెల్లు ఫోను
సరిగా ఉపయోగించే వారి చేత శోభిల్లు  ఫోను.    

కామెంట్‌లు లేవు: