22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

విను వీధిని

చిత్రమైనది ఈ విధి
విను, వీధిని పడేస్తుందో!
ఎప్పుడు ఎవరిని
వినువీధిని తిప్పేస్తుందో!
19, ఫిబ్రవరి 2019, మంగళవారం

"తెలుగు" వాడే.

పంచె కట్టాలంటే 
'తెలుగువాడే"
పంచ్ కొట్టాలంటే
"తెలుగు" వాడే. 

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

ఓ పన్ జెయ్


Image result for god net
దేవుడి "నెట్"
కనెక్ట్ అవ్వాలా
ఓ పన్జెయ్
మది "సిస్టం"లో
భక్తి "విండోస్"ని
ఓపన్జెయ్.


7, ఫిబ్రవరి 2019, గురువారం

5, ఫిబ్రవరి 2019, మంగళవారం

అమ్మాయెందుకని?

Image result for selective abortion and female infanticideపుట్టకముందే చిదిమేస్తున్నావ్
అమ్మా! యెందుకని!
మీ అమ్మ నిన్నలా చేసిందా
అమ్మాయెందుకని?

-

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

"రాం...రాం"

Image result for lord rama images

"రాం...రాం" అంటే పుణ్యం
పుణ్యకార్యానికి తోడుగా
"రాం...రాం" అంటే పాపం.


2, ఫిబ్రవరి 2019, శనివారం

నాకమంటారు.

Image result for honeyస్వర్గానికి మరోపేరు
నాకమంటారు
అరచేతిలో తేనెను
నాకమంటారు.