13, ఏప్రిల్ 2021, మంగళవారం

తగిలించాడు

 

హెల్మెట్టు ఉంది
బండికి తగిలించాడు వాడు
మాస్కు ఉంది
గొంతుకు తగిలించాడు వీడు
ఆయువు వుంది
ప్రక్కన తగిలించాడు యముడు.

7, ఏప్రిల్ 2021, బుధవారం

"రెండవ అల" జడి

 

"రెండవ అల" జడిపిస్తోంది
కరోనా "సెకండ్ వేవ్"
అలజడి అది.


స్మార్ట్ ఫోన్

 

స్మార్ట్ ఫోన్
అరచేతిలో వైకుంఠం
తప్పుగా వాడితే
శ్రీకృష్ణ జన్మస్థానం
అడ్డదిడ్డ సెల్ఫీతో
పోవడమే కైలాసం

"పెన్" నిధి

 

తరగని
పెన్నిధి
అదో గని
"పెన్" నిధి

గే(గె)లిచేస్తారు

 

తడవకు తడవకు
ఓడితే గేలిచేస్తారు
దడవక విడవక
సాగితే గెలిచేస్తారు.