29, డిసెంబర్ 2020, మంగళవారం

మొహమ్మారి

 

అంతం అయిందనుకున్నాం
కరోనా "మహమ్మారి"
వింతగా వస్తోందట
వేగంగా "మొహమ్మారి"

28, డిసెంబర్ 2020, సోమవారం

కరోనా- 2


 జనాలకు "సినిమా" చూపించి
"హిట్" కొట్టి సీక్వెల్ గా
కరోనా- 2 వస్తోంది
ఈసారి "ప్లాప్" చేయండి.

26, డిసెంబర్ 2020, శనివారం

వల"పుల్"


 వల "ఫుల్" వేస్తారు
వలపుల "వల"రాజులు
తెలివిగ మెలగాలి
వల"పుల్" రాణులు.


24, డిసెంబర్ 2020, గురువారం

డబ్బులిస్తుందని


 బాగా డబ్బులిస్తుందని
"కిస్ మిస్"లు కలిపి లడ్లు
ఇంగ్లీషు "ఆంటీకి"
బాధ్యత వదలబోమని
నాలుగు "పలుకులు"
తెలుగు "తల్లికి."


23, డిసెంబర్ 2020, బుధవారం

దారుణం.

 

ఊపిరి పీల్చుకుంటున్న తరుణం
ఊపిరి బిగబట్టి విన్న విషయం
ఊపిరి తీసే కరోనా రోగం
రూపును మార్చిందట, దారుణం.

22, డిసెంబర్ 2020, మంగళవారం

"హెర్బలులు"

 

కోవిడ్ కోరుతోంది
బలవంతపు బలులు
అవుతున్నారు పోరుకోసం
మానవులు "హెర్బలులు"


10, డిసెంబర్ 2020, గురువారం

"కట్" బాటే

 

విడివిడిగా తిరగమంటే
విచ్చల విడే
మాస్కు "కట్టు"బాటంటే
"కట్" బాటే

9, డిసెంబర్ 2020, బుధవారం

"కోవిదు"లతో

 

"ఊహా" జనిత
కథనాల "కోవిదు"లతో
సోషల్ మీడియాకు
"ఊపిరి సలుపని" కరోనా.



8, డిసెంబర్ 2020, మంగళవారం

"దూర్" అలవాట్లు

 పిలుస్తూ ఉంటే 

"దురలవాట్లు" 

దూరకు, కావు 

"దూరు" అలవాట్లు

దూరముంచు, అవి 

"దూర్" అలవాట్లు


7, డిసెంబర్ 2020, సోమవారం

5, డిసెంబర్ 2020, శనివారం

అరచేతుల బోణి

 మారలేదులే ఆ ఆచారం

నిద్ర లేస్తూనే ప్రతి ఉదయం

చూపులకు అరచేతుల బోణి

కాకుంటే మధ్యలో చరవాణి.

4, డిసెంబర్ 2020, శుక్రవారం

చిరు"గుల"

 

"చిరుగుల" దుస్తులను

కొనడం, వేసుకొనడం

కొందరికి అదొక

చిరు"గుల" ఫ్యాషన్.

3, డిసెంబర్ 2020, గురువారం

"లవా"టే

 

నమ్మించి గొంతులు
కోయటం కొందరికలవాటే
ప్రేమించి గొంతులు
"కోయటం" కొందరికి "లవా"టే.