23, డిసెంబర్ 2016, శుక్రవారం

తెలుగు వాడిననిపించుకోండి

ఏ వాడనున్నా...
తెలుగు వాడి, 
తెలుగు వాడిపోకుండా
తెలుగు 'వాడను' అనుకోకుండా
'తెలుగువాడను' అనుకుంటూ
తెలుగు 'వాడిని' పెంచాలనుకుని
'తెలుగువాడిని' పెంచాలనుకునే
తెలుగువాడి కోసం, ఈ బుజ్జాయి
తెలుగు పిల్లలకు పరిచయం చేయండి
తెలుగు వాడిననిపించుకోండి 
ఒకసారి ఈ బ్లాగును సందర్శించండి. 

golibujji.blogspot.com

24, నవంబర్ 2016, గురువారం

వాడినపూలు

పూజ చేయునపుడు  ఎప్పుడూ 
పెట్టగూడదు దేవునికి వాడినపూలు. 

పూజచేసిన తరువాత భక్తితో
పెట్టుకోవాలి దేవునికివాడిన పూలు. 
   

27, అక్టోబర్ 2016, గురువారం

ఆ 'పన్నులను'

రక్షిస్తాడు దేవుడు 
సరిగా ధ్యానిస్తే ఆపన్నులను 

శిక్షిస్తుంది ప్రభుత్వం
సరిగా కట్టకపోతే  ఆ పన్నులను.  
  

21, సెప్టెంబర్ 2016, బుధవారం

ఒక పని 'ముట్టు' కొనాలి.ఖాళీగా ఎవరూ ఎపుడూ ఉండకూడదు
కల్పించుకొనైనా ఏదో ఒకపని ముట్టుకొనాలి.

ఆపనిని సక్రమంగా పూర్తిచేయడానికి  
అవసరానికి తగిన ఒక పనిముట్టు కొనాలి. 


16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

మనిషి..కో ..తలను.Image result for chatting imagesఆదేవుడు పుఱ్ఱెకో బుద్ధిని పెట్టి 
నిలిపి ఉంచాడు మనిషికో తలను. 

ఏంచేస్తాం తప్పదు భరించాలి 
కోస్తుంటారు ఒక్కొక్క మనిషి కోతలను.