31, జనవరి 2021, ఆదివారం

29, జనవరి 2021, శుక్రవారం

అ(బ)శుద్ధం

 

"తానంటే" అందరూ
"మూసుకొని" పోతున్నారని
"ఎగిరి పడుతోంది" అశుద్ధం
"శుచిగా " ఉండే వారు అక్కడ
"నోరు తెరవ"రనడం కాదు అబద్ధం.

"మూడ్" భక్తి

 

భక్తి "మూడ్"
మంచి చేస్తుంది
"మూఢ" భక్తి
ముంచేస్తుంది.


20, జనవరి 2021, బుధవారం

సిజేరియన్

 

తెచ్చుకుంటుంది సమాజం
తగిన స్పందన లేక
సిరప్ తో పోయేదాన్ని
సిజేరియన్ దాకా


17, జనవరి 2021, ఆదివారం

వే టికా

 

కరోనా! నీపై సంధిస్తున్నాం
పాశుపతాస్త్రం కాచుకోవే టీకా
నీవెన్ని తలలు మార్చినా
వేయకమానం వేటిక.

15, జనవరి 2021, శుక్రవారం

వారిస్తుంది

 

తప్పటడుగులు వేస్తే
అమ్మ వారిస్తుంది
భక్తితో కోరితే
అమ్మవారిస్తుంది.


13, జనవరి 2021, బుధవారం

"చేయూత్"

 

యువత అంటే
"యూత్" అని
నవసమాజ
నిర్మాణానికి
ఇవ్వాలి "చేయూతని"

6, జనవరి 2021, బుధవారం

క"త్తెర"


 'అందం'గా తెర ఉంచి
వర్ణిస్తే "శృంగార రసం"
'మందం'గా "కత్తెర" లేక
వాగేస్తే "బూతు మయం"
'అందమందక' "లోతుగా"
వివరిస్తే "శరీర శాస్త్రం"