30, జూన్ 2019, ఆదివారం

'కూడ' పెట్టడం

మనిషి చేయవలసింది
ధర్మంగా కూడబెట్టడం
మర్మంగా ఇతరులకు
కూడ పెట్టడం.


29, జూన్ 2019, శనివారం

"యంత్రం" - "మంత్రం"

పద్దతి'గా కూర్చిన వస్తువులకు
విద్యుచ్చక్తి తోడైతే "యంత్రం"
'పద్దతి'గా పేర్చిన అక్షరాలకు
స్వర శక్తి తోడైతే "మంత్రం".


27, జూన్ 2019, గురువారం

కంటి "కానక"

పెద్దవారైతే, శుక్లము 
రావచ్చు కంటి "కానక"
"పెద్ద"వారైతే, చిన్నచూపు 
కొందరిపై "కంటికానక".

26, జూన్ 2019, బుధవారం

'కామా' లే

కామాంధుల
పాపాలకు కారణం
ఫుల్ స్టాప్ పెట్టని
'కామా'లే.

25, జూన్ 2019, మంగళవారం

భో 'జనానికి' దూరం

మనిషి దూరం
సిగ్గుగా ఉంటే జనానికి
సిక్ గా ఉంటే భోజనానికి.  

24, జూన్ 2019, సోమవారం

19, జూన్ 2019, బుధవారం

అమ్మా! యిదా?

మురికి గుంటలో పురిటి బిడ్డ 
నీ కన్నప్రేమ అమ్మా! యిదా?
పాపం కళ్ళు మూసుకుపోయిన నీదా?
కళ్ళుకూడా తెరవని అమ్మాయిదా? 

15, జూన్ 2019, శనివారం

పెద్ద "వారు".

ప్రపంచ దేశాధినేతలు 
ఎవరికి వారే "పెద్దవారు"
సంయమనం కోల్పోతే 
జరుగుతుంది పెద్ద  "వారు". 

12, జూన్ 2019, బుధవారం

"నగ"వుండాలంటే

మనకు బంగారం కావాలి
మెడలో "నగ"వుండాలంటే
మనసు బంగారం కావాలి
ముఖంలో "నగవుం"డాలంటే.

11, జూన్ 2019, మంగళవారం

9, జూన్ 2019, ఆదివారం

మొలకే

బీదవాడి వలువ
కేవలం మొలకే
బీజము నాటితే
వచ్చేది మొలకే.

4, జూన్ 2019, మంగళవారం

"నై" పుణ్యం.

సాధించాలి నచ్చిన 
పనిలో నైపుణ్యం 
పరులను కష్టపెట్టే
పనిలో "నై" పుణ్యం. 

3, జూన్ 2019, సోమవారం

కలువ లేమా

మనం ఎప్పటికీ 
కలువలేమా? 
అంటున్నాడు చంద్రుడు 
కలువ లేమా!

2, జూన్ 2019, ఆదివారం

అ'త్తగవుండక'

కొడుకున్నాక 
అత్తగ వుండక తప్పదు
కోడలున్నాక 
అ'త్తగవుండక' తప్పదు.