15, ఆగస్టు 2022, సోమవారం

తిరంగా జండా

 

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

ప్రతి భారతీయుణ్ణీ
తెల్లని స్వచ్ఛమైన మనసుతో
ధర్మాన్ని నిలపమంటుంది
మన జండా
కషాయంలా ఉన్నా
శుభప్రదమైన మన
సంస్కృతిని వదలకంటుంది
మన జండా
నీవు నీ దేశం పచ్చగా
ఉండాలంటే ప్రకృతిని
కాపాడుకోమంటుంది
మన జండా
నిలబడి చెబుతోంది
స్థిరంగా జండా
రెపరెపలాడుతూ మన
తిరంగా జండా.

7, ఆగస్టు 2022, ఆదివారం

"న్యూడ్"ల్స్

 

జనాల అభి 'రుచి'
మారుతోంది
"న్యూడ్"ల్స్ ని
"లైక్" చేస్తున్నారు


6, ఆగస్టు 2022, శనివారం

విప్పేటప్పుడు

 

నోరూ, బట్టలు
"విప్పేటప్పుడు" జాగ్రత్త
గోడకు "సెల్" లుంటాయి.


5, ఆగస్టు 2022, శుక్రవారం

"ఛి" త్రగుప్తులు

 

కొన్ని సెల్ ఫోన్లు
"చిత్ర" "గుప్" తులు
కొన్ని "ఛి" త్రగుప్తులు


1, ఆగస్టు 2022, సోమవారం

రూ"మరులు"

 

పరులను ఇబ్బంది
పెట్టనంత వరకు
పరవాలేదు
మరులు, రూమరులు.