ఒకటే 2 లా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఒకటే 2 లా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, అక్టోబర్ 2026, ఆదివారం

క్లోజ్ అప్

 సినిమాల్లో

"కొన్ని" సీన్లకు

ఒకప్పుడు కెమేరా "అప్"
ఇప్పుడు "క్లోజ్ అప్"



9, అక్టోబర్ 2026, శుక్రవారం

ఆవాహనం

 

మద్యం మత్తులో 

నడిపావా ఆ వాహనం!

 

అది మృత్యువు నిన్ను 

చేరుకోటానికి ఆవాహనం 

15, జులై 2026, బుధవారం

"ఇది"

 

"ఇది" అని చెప్పలేక 

ఇదైపోయే ఇదిలో  

"ఇది"ని వాడితే 

ఎంత ఇదిగా ఉంటుందో! 

అందుకే "ఇది" అంటే 

నాకు ఎంతో ఇది. 

"కలి" సొచ్చే

 


కలిసొచ్చే

రోజులే కాదు

నీ జీవితంలోకి

"కలి" సొచ్చే
రోజులుకూడా
ఉంటాయి - జాగ్రత్త.

27, మే 2026, బుధవారం

6, మే 2026, బుధవారం

మనటానికే

 ప్రతి జీవి పుట్టుకా 

మనటానికే


ఎప్పుడొకప్పుడు  

పుటుక్కుమనటానికే 


22, మార్చి 2026, ఆదివారం

"రాత"

పాట వ్రాస్తే

"ఇదీ" మా రాత

అని చెప్పుకునేట్లుండాలి


వినే వారు

ఇది మా "రాత"

అని నొచ్చుకునేట్లు కాదు.



 

1, జనవరి 2025, బుధవారం

వంగడం


 మొలకెత్తింది
"క్రొత్త 2025" వంగడం
"వెలుగు" వృక్షమై నిలచి
"మాను"కోవాలి చీకటికి "వంగడం"


27, డిసెంబర్ 2024, శుక్రవారం

తోపులాట

 బలహీనుల 

ప్రాణం మీదికే 

కొన్ని "తోపులాట" లు

కొందరు "తోపు"లాటలు

28, నవంబర్ 2024, గురువారం

"ఓడ"నిస్తుంది

 

సరియైన జ్ఞానం
జీవనయానానికి
"ఓడ" ఔతుంది

పనికి మాలిన అతితెలివి
జీవన పోరాటంలో
"ఓడ"గొడుతుంది.


26, అక్టోబర్ 2024, శనివారం

"మందే" లేకుంటే

 

"మందే" లేకుంటే
త్రాగటానికి
అంత "మందే" లేకుంటే
ఇక ఏమందును
రాబడిలేక ప్రపంచం
"మందు" తాగాల్సిందే.


30, ఆగస్టు 2024, శుక్రవారం

వైర్ లెస్

 

సాంకేతికతకు
"వైర్"లు
సమాజానికి
"వైరులు"
లేకుంటేనే
అభివృద్ధి.


19, ఆగస్టు 2024, సోమవారం

న్యూ,సెన్స్

 శాస్త్ర విజ్ఞానం పెరిగి


"న్యూ" "సెన్స్" తో  

నరు"డెదిగి" పోతున్నాడు

ఆకాశానికి


"న్యూసెన్స్" తో 

నరుడె "దిగి" పోతున్నాడు

పాతాళానికి. 

7, జులై 2024, ఆదివారం

పడవలే

 


వర్షాన్ని చూస్తూ-


పల్లెలో "సన్నకారు" 

కర్షకుడు అంటున్నాడు

ఇంకా "పడవలే"


నగరంలో "చిన్నకారు"

చోదకుడు అనుకుంటున్నాడు

"కావాలి" పడవలే.

13, మే 2024, సోమవారం

"voteమి"

 

ఓటరుకు నాయకులను
"ఎన్నుకొనే" సమయం
నాయకులకు ఓటరును
ఎన్ని, "కొనే" సమయం

ప్రతి వాడూ
అంటాడు "vote me"
చెడ్డవాడికి
అందించు "ఓటమి"

2, మే 2024, గురువారం

way to "వేటు"

 

సరియైన వారికి
వేసే "ఓటు"
మంచి భవిత
బతుకుకు "ఓ2"
లేకుంటే అవుతుంది
way to "వేటు"


24, ఏప్రిల్ 2024, బుధవారం

"వంక" ర

 

మనం గీస్తే
"వంకర" గీతలు
వాటి "వంక" చూడలేం

"బాపు" గీస్తే అవి
"వంక" లేని గీతలు
"బాపురే" అనకుండా ఉండలేం.


15, ఏప్రిల్ 2024, సోమవారం

ముద్దౌతాడు

 

తన శ్రమలో
చెమటతో
తడిసి ముద్దౌతాడు

ఆకలిగొన్న
భూజనులకు
అన్నం ముద్దౌతాడు

అందుకే రైతు
పుడమితల్లికి
ఎంతో ముద్దౌతాడు.



13, ఏప్రిల్ 2024, శనివారం

"నిల్"బడి

 మనుషుల్లో

రెండే రకాలు

చరిత్రలో
"నిలబడి పోయేవారు"
"నిల్"బడి "పోయేవారు"


4, ఏప్రిల్ 2024, గురువారం

మెక్కటం

 

సింహాసనమెక్కటం
అందినంత మెక్కటం

అలా ఉండకూడదు
ప్రజలను పాలిస్తే

ఉండాలిలా 
ఎలా ఉంటుందో
అమ్మ పాలిస్తే