29, ఆగస్టు 2021, ఆదివారం

"బాస"ట

 అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.


బహు తీయనిది
మన "బాస"ట
మనుగడకు కోరుతోంది
మన "బాసట"


27, ఆగస్టు 2021, శుక్రవారం

"వే" లు

 

జీవించడానికి
ఎన్నెన్నో "వే" లు
ఎంచుకో ఎవరూ
ఎత్తిచూపకుండా "వేలు"


23, ఆగస్టు 2021, సోమవారం

22, ఆగస్టు 2021, ఆదివారం

"రాకీ" "వే" - "రావణ" పూర్ణిమ

 


నేడు సోదరుల చేతులు
అన్నీ రాకీవే
ఎదురు కాకూడదు
ఏ సోదరికీ "రాకీ" "వే"
కావాలి అన్ని రోజులు
శ్రావణ పూర్ణిమలు
రాకూడదు ఎప్పుడూ
"రావణ" పూర్ణిమలు.


17, ఆగస్టు 2021, మంగళవారం

లౌ "కిక్"

 

ఆశ్రమంలో భక్తులకు అలౌకికానందం ఆ శ్రమ తో స్వామీజీకి
లౌ "కిక్" ఆనందం.
13, ఆగస్టు 2021, శుక్రవారం

12, ఆగస్టు 2021, గురువారం

"స్పై" "డర్"

 

"నెట్" తో "సెల్"ధరులు
కొందరు "స్పైడర్"లు
కొందరు "స్పై" "డర్" లు
జాగ్రత్తగా ఉండాలి నరులు.


11, ఆగస్టు 2021, బుధవారం

ఫార్ మసి

 

వంటగది అంటే
కాదురా "మసి"
తెలుసుకుంటే
అదొక "ఫార్మసి"


8, ఆగస్టు 2021, ఆదివారం

పగలొద్దు

 

నిశాచరులు
పగలొద్దంటారు
శాంతికాముకులు
పగలొద్దంటారు.


3, ఆగస్టు 2021, మంగళవారం

మూడాచారాలు

 


మూఢాచారాలు కాదు మూడాచారా

లు

మూడోవేవుకు మూడాచారాలు
"ఒత్తిడిలేదు" గమనించి పాటించు
ఒత్తిడిలేక సుఖంగ జీవించు.


1, ఆగస్టు 2021, ఆదివారం

వారసత్వంతెలుసుకోవాలి
మనవారి సత్వం
నిలుపుకోవాలి
మన వారసత్వం.