28, డిసెంబర్ 2019, శనివారం

ఇంగిలీషు "షుగరు".

చేత వెన్నముద్ద లేని
జానిజాని షుగరు
తెలుగుతీపి ముట్టలేని
ఇంగిలీషు "షుగరు".

25, డిసెంబర్ 2019, బుధవారం

రాత - గీత

గుడిలో నల్లనయ్య
గీతతో రాతలు
బడిలో నల్లబల్ల
రాతతో గీతలు
నరులకు మారుస్తూ.


16, డిసెంబర్ 2019, సోమవారం

అగ్నిపరీక్ష

"అగ్నిపరీక్షకు" నిలచి నీరు
ఆవిరై ఆకాశయానం చేస్తోంది
"గాలితిరుగుళ్ళతో" ఆవిరి
నీరై భూమిపై పతనమౌతోంది.


15, డిసెంబర్ 2019, ఆదివారం

ఇంట "రెస్టు"

కొందరికి ఎప్పుడూ
ఇంట "రెస్టు"
తీసుకోవడమంటే
"ఇంటరెస్టు".


9, డిసెంబర్ 2019, సోమవారం

"రేపురుషులు"

"రేపురుషుల"
అతి "కామాలు"
అతివల ప్రాణాలకు
"ఫుల్ స్టాప్" లు.


2, డిసెంబర్ 2019, సోమవారం

"ప్రత్యక్ష ప్రసారం"

జరిగితే ఘోరం
చెప్పే విషయం
తలపిస్తోంది "ప్రత్యక్ష ప్రసారం"
ఉందా అంత అవసరం.


1, డిసెంబర్ 2019, ఆదివారం

"విష్" సంస్కృతి

మృగాళ్ళ "విష్" సంస్కృతి
చెందుతోంది అభ్యున్నతి
'యూస్ అండ్ త్రో' నుండి
'యూస్ అండ్ ఫైర్' దాకా.

కు...సంస్కారం

సమాజానికి ప్రమాదం
పిల్లల కుసంస్కారం
చదువుతో నేర్పాలి
పిల్లలకు సంస్కారం.