26, జనవరి 2019, శనివారం

కాం వెంట్లు.

Image result for fb logo


"గుడ్ మార్నింగ్" - పోస్టుకి
వందల కామెంట్లు
"గుడ్" - మార్నింగ్ పోస్టుకి
అందరు కాం వెంట్లు.

24, జనవరి 2019, గురువారం

22, జనవరి 2019, మంగళవారం

19, జనవరి 2019, శనివారం

అద్దాలనుకోకు.


Image result for spectacles

ప్రతివాడికీ నీ 'పైత్యాన్ని'
అద్దాలనుకోకు
వారి కళ్ళకుండేది నీలాటి
అద్దాలనుకోకు.

16, జనవరి 2019, బుధవారం

చూడ మంచు.

Image result for sunrise images


బాలభానునికి ప్రకృతిమాత
సాంబ్రాణి పొగ వేసినట్లుంది
బయటకుచూడ మంచు
ఉషోదయం చెప్తోంది ఒకసారి 
బయటకు చూడమంచు.   

15, జనవరి 2019, మంగళవారం

జీవితపు ముగ్గు


Image result for kolam images


దేవుడిచ్చిన క్షణముల చుక్కల్ని
ఎవరికి వారే కలిపి
వేసుకోవాలి జీవితపు ముగ్గు
వేసుకున్నవారికి వేసుకున్నంత.

12, జనవరి 2019, శనివారం

7, జనవరి 2019, సోమవారం

జాగ్రత్త ఒళ్ళు


Image result for cell chating

చేతిలో ఉంటే సెల్లు
కదిలిస్తే చాలు కళ్ళూ వేళ్ళు
కోరింది నీవైపు మళ్ళు
కాని - జాగ్రత్త ఒళ్ళు.

4, జనవరి 2019, శుక్రవారం

నవల.Image result for novel life

ఈ లోకం
విధి పరచిన వల
ప్రతి జీవితం
పలు మలుపుల నవల.

కావు! కావు!


Image result for vishnu god


భగవంతుడు ప్రత్యక్షమైతే 
ఆస్తికుడు - 

నీవే నాదేవుడవు, కావు! కావు!
నాస్తికుడు - 

నీవేనా దేవుడవు? కావు,కావు.