31, మే 2020, ఆదివారం

ఆగమని

నిన్నటిదాకా, స్వదేశ
ఆగమన శుభాకాంక్షలు
నేడు, స్వదేశమా?
ఆగమని మహా ఆంక్షలు.


30, మే 2020, శనివారం

బూతర్థాలు

కొంతమంది ఎప్పుడు చూసినా
పె(ప)ట్టుకొనుంటారు "భూతద్దాలు"
"ఆశీర్వచనం"లో కూడా అదేపనిగా
వెతుకుతూ ఉంటారు "బూతర్థాలు."

29, మే 2020, శుక్రవారం

పోరు

వస్తే కొందరి మధ్య వివాదం
ఒకరన్నా సర్దుకొని పోరు
అప్పుడే పెడుతుంది పాదం
నేనున్నానంటూ "పోరు"


28, మే 2020, గురువారం

పుండు - కారం

మనిషి బ్రతుకుపై
కరోనా చేసింది పుండు
జాగ్రత్త , కారం చల్లడానికి
వస్తోంది మిడతల దండు.

27, మే 2020, బుధవారం

"దూరమని"

దూరమని చెప్తోంది
నలుగురిలోకి భౌతికంగా
దూరమనికాదు
నలుగురికీ భౌతికంగా
"దూరమని"


26, మే 2020, మంగళవారం

ఇళ్ళకోసం

ప్రాణాలకోసం ఇళ్ళలో
అరచేతులు తుడుచుకొని
పడుకున్న వాళ్ళు కొందరు

ఇళ్ళకోసం ప్రాణాలను
అరచేతుల్లో పెట్టుకొని
నడుస్తున్న వాళ్ళు కొందరు.

25, మే 2020, సోమవారం

మూడు

ప్రపంచానికి కరోనా
మూడునట్లు చేసింది
మూడురంగులద్దింది
మూడును మార్చింది.

"సుర్రు"యుడు.

మామూలు రోజుల్లో
ఆయన "సూర్యుడు"
ఎండాకాలంలో మాత్రం
ఔతాడు "సుర్రు"యుడు.
14, మే 2020, గురువారం

'ఎవరుగ్రీన్'

ఎవరు 'గ్రీన్' లో
ఉన్నారు అని చూడకు
అందరూ 'ఎవర్ గ్రీన్' గా
ఉండాలని చూడు.


8, మే 2020, శుక్రవారం

"విషాక్"

ఒకవైపు కరోనా "షాక్"
మరోవైపు "విష" వాయువు లీక్
అందరికీ మైండ్ బ్లాక్
విశాఖ ఇప్పుడు "విషాక్" 

7, మే 2020, గురువారం

6, మే 2020, బుధవారం

"బార్లా"

ఇన్నాళ్ళూ దీక్ష ఇల్లే దేవాలయంలా
దానిని మార్చకు "బార్లా"
కరోనా మహమ్మారికిలా
తలుపులు తెరవకు బార్లా.


5, మే 2020, మంగళవారం

"భౌ"తిక దూరం.

వైనందు కోవడం కోసం 
వైనంలేక దూరంచేసిన  దూరం 
అందితే ఆపై"ని షా"మాజికం
ముదిరితే "భౌ"తిక దూరం.  

4, మే 2020, సోమవారం

వీర "మాస్కు"

3, మే 2020, ఆదివారం

ఆ నాలుగో రోగమేరా

జ్వరం, దగ్గు, ఆయాసం
కనబడే ఆ మూడు రోగాలైతే
కనబడని ఆ నాలుగో రోగమేరా
కరోనా వైరస్.

2, మే 2020, శనివారం

"బూతే"శుడు.

"ఒత్తు" గా జ్ఞానం లేనివారికి
లింగడు "బూతే"శుడు.
మస్తుగా జ్ఞానం గలవారికి
లింగమూర్తి "భూతేశుడు".

1, మే 2020, శుక్రవారం

సబ్బులు.

జనాలకు అంటుకోకుండా
"మాయ" దారి జబ్బులు
నురగలు గక్కుకుంటూ
శ్రమిస్తున్నాయ్ సబ్బులు.

మీరు ఏ "వర్ణం"

ఇప్పుడు అందరికీ క్వశ్చన్
మీరు ఏ "వర్ణం" వారని
రెడ్, ఆరంజ్, గ్రీన్
ఎందులో ఉన్నారని.