27, మే 2024, సోమవారం

క( కు)క్కకు

 

కనబడినదల్లా
కడుపులో కుక్కకు
బరువైపోతావు

కడుపులో ఉన్నదల్లా
బయటకు "కక్కకు"
"తేలికై"పోతావు.

26, మే 2024, ఆదివారం

"బ్రేవ్" పార్టీ


 "రేవ్" పార్టీ అంటే
లోపల మొత్తం
విప్పుకుని ఆడటం
బయటకు ముఖం
కప్పుకుని రావటం