30, జూన్ 2020, మంగళవారం

హస్త వాష్

కరోనా విషయంలో
వైద్యుని "హస్తవాసి" కన్నా
ముందు ఎవరికి వారి
"హస్త వాష్" ముఖ్యం.


29, జూన్ 2020, సోమవారం

ప్ర"ముఖ" సమస్యలు

ప్ర"ముఖ" సమస్యలు 
నేడున్నవి రెండు
మాస్కు "కట్టింగు" 
హెయిరు కట్టింగు

28, జూన్ 2020, ఆదివారం

బీ "పాజిటివ్"

బీ "పాజిటివ్"
నిన్నటి "అనునయపు" మాట
బీ "నెగటివ్"
నేడు అను "నయపు" మాట.

నాస్తి

ఎంతనాస్తికుడైనా
చివరకు "హరీ"
అనక తప్పదు
"కైలాసానికి"
వెళ్ళక తప్పదు.


26, జూన్ 2020, శుక్రవారం

25, జూన్ 2020, గురువారం

వజ్రపుటుంగరం

సూర్యచంద్రులు కలసి 
చేయించిన వజ్రపుటుంగరాన్ని
గ్రహణంరోజు లోకానికి 
చూపిస్తోంది ప్రకృతిమాత.

బ్రతుకుండదు

ఒక్క రోజైనా తమ కళ్ళు 
తడవని తుడవని బ్రతుకుండదు
ప్రతిరోజూ తమ వేళ్ళు
తడవకు తుడవకపోతే "బ్రతుకుండదు."



19, జూన్ 2020, శుక్రవారం

"వల"స

పట్నాలనుంచి పల్లెటూళ్ళకు
"వల"స వెళ్తున్నాయ్
మనుషుల "పని పట్టడానికి"
కొన్ని "కరోనా" కుటుంబాలు.   


18, జూన్ 2020, గురువారం

తరిమేసే "వార్" లము

ఓ విషపు పురుగా! డ్రాగన్!
చేయకు నీ దుస్సాహసాలు డ్రాగ్ ఆన్
యుద్ధానికి కవ్వించే చైనా!
సిద్ధం మేము ఎటునుంచైనా
దాడిచేసి కూల్చేయాలనుకోకు 
మమ్మల్ని "కూల్" చేసే వారనుకోకు
అవసరమైతే కాల్చేసే వార లము
"భరతం" పట్టి తరిమేసే "వార్" లము
తుడిచేయాలనుకోకు మా "సంతోషా"లు
మిగిలేది చివరకు నీకు దుఃఖాలు.

17, జూన్ 2020, బుధవారం

పడగ

సంతోషించాం,కరోనా పాము
వెనుదిరుగుతూ కనపడగ
ఆదమరిచాం,విప్పుకొస్తోంది
బుసలు కొడుతూ తన "పడగ."


15, జూన్ 2020, సోమవారం

తీస్తే "పోరు" "సణుగుళ్ళు."

అరచేతిలో సెల్లు
దాని వైపే కళ్ళు
కదులుతూ వేళ్ళు
కదలకుండా ఒళ్ళు
మనసెటో తిరుగుళ్ళు
త్రొక్కుతూ పరవళ్ళు
ఒక్కోసారి ఒత్తిళ్ళు
అదోరకం థ్రిల్లు
టైంపాస్ ఫుల్లు
ఉపయోగం నిల్లు
ఉంటే కొన్ని హద్దుల్లు
మరెంతో యూజ్ ఫుల్లు
దీనికోసం పసివాళ్ళు
ఏడుస్తూ వెక్కిళ్ళు
అతిగ వాడు కుర్రాళ్ళు
తీసిపోరు ముసలాళ్ళు
తీసి పోరు సంకెళ్ళు
తీస్తే "పోరు" "సణుగుళ్ళు."





14, జూన్ 2020, ఆదివారం

SMS "ఆచారాలు"

కంటికి కనబడలేదని
మానెయ్యకు SMS "ఆచారాలు"
'కరోనా నాస్తికుడ' వైతే
అదే నీ 'ఆస్తి' అవుతుంది.


13, జూన్ 2020, శనివారం

వైరస్సైనికులు.

ఇప్పుడు పుడమి అంతా
ఒక యుద్ధభూమి...కాదు వ్యాధిభూమి
మరి మనుషులంతా
వీరసైనికులు...కాదు వైరస్సైనికులు.


9, జూన్ 2020, మంగళవారం

కరోనాను కొలవడానికి

కరుణ జూపమని కరోనాను
"కొలవడానికి" కావల్సినవి
బెత్తెడు సబ్బుబిళ్ళ
జానెడు గుడ్డముక్క
ఇంటిలో మూరెడు దూరం
బయట బారెడు దూరం.


8, జూన్ 2020, సోమవారం

మన్ "డల్" దీక్ష

"మండలదీక్ష" లాంటి లాక్డౌన్
మన్ "డల్" దీక్ష ఐపోయిందని
నియమాలు వదిలేస్తే ఊరుకోడానికి
కరోనా దేవుడు కాదు.


7, జూన్ 2020, ఆదివారం

"కలరంటే"

కొంతమందికి
వ్యామోహం "కలరంటే"
నమ్ముతారా
అలాటి వారూ కలరంటే?


6, జూన్ 2020, శనివారం

ఒంటిగది

"అంటు" భయంతో లాక్ డౌన్లో
ఇంటిగదికే పరిమితమైతే తెలిసింది
"ఒంటిగది" బాగుకోసం
వంటగదిలోనే మందులున్నాయని.


5, జూన్ 2020, శుక్రవారం

ముసుగేసుకొస్తున్నాడు.

మనిషి తాను చేసిన ద్రోహానికి
ఇంట్లో దాక్కుంటున్నాడు
మొహం చూపించలేక ప్రకృతికి
బయటకు ముసుగేసుకొస్తున్నాడు.

4, జూన్ 2020, గురువారం

"వాట్ల" దెబ్బ

సహజీవనమంటూ
అంటుకు తిరిగింది
వాడి అల"వాట్ల" దెబ్బకు
షాకై "పోయింది"- కరోనా.


3, జూన్ 2020, బుధవారం

స్కిన్ టచ్

స్మార్టు ఫోనైనా, స్మార్ట్ మ్యానైనా
అనవసరమైన యాపు, కరోనా 
డౌన్లోడ్ కాకుండా చూసుకో
టచ్ స్క్రీన్ తో, స్కిన్ టచ్ తో.