31, ఆగస్టు 2020, సోమవారం

కోవిడ్ లు

 కోవిదుల మాటలు

లెక్కలేనితనంగా తిరిగాం
కోవిడ్ ల మాటున
లక్కుతో బ్రతుకుతూ ఉన్నాం.


29, ఆగస్టు 2020, శనివారం

తెలుగు వాడ

 తెలుగుతల్లి "బిడ్డ" మాట

నేను తెలుగువాడను.
పరభాషా "ప్రియుని" మాట
నేను తెలుగు వాడను.

--

24, ఆగస్టు 2020, సోమవారం

ఖాద్యాలు.

 నోరు తిరగని వయసులో

నేర్పే సుమతీ, వేమన పద్యాలు

ఊరు తిరిగే వయసులో

ఉపయోగపడే సుమధుర ఖాద్యాలు.


23, ఆగస్టు 2020, ఆదివారం

22, ఆగస్టు 2020, శనివారం

21, ఆగస్టు 2020, శుక్రవారం

20, ఆగస్టు 2020, గురువారం

"కరోనా" కొమ్ములు

 "కరోనా"కు కొమ్ములు

లేవంటాడు తెలుగు పంతులుగారు
ఉన్నాయంటాడు సైన్సు మాస్టారు
విరుస్తానంటాడు సైంటిస్టు సారు

16, ఆగస్టు 2020, ఆదివారం

వాటైంది?

 అందరిలో "కోవిడ్"ని చూసి

దూరంగా ఉండడం  

తొందరగానే అలవాటైంది

అందరిలో "గోవింద్"ని చూసి

దగ్గరగా ఉండటం

యుగాలైనా అలవాటు కాలేదు. 

11, ఆగస్టు 2020, మంగళవారం

ని'బంధ'నలు

 జీవితానికీ క్రీడకూ

ఉంటాయి నిబంధనలు

స్వేచ్ఛ కోరుతూ అనుకోకు

వాటిని బంధనాలు.
-

6, ఆగస్టు 2020, గురువారం

"తల" పెట్టాలని

ఆలోచించు - పడుకునేప్పుడు
ఏ వైపు "తల" పెట్టాలని
లేచింతర్వాత మంచిగా
ఏ పని "తలపెట్టాలని."


4, ఆగస్టు 2020, మంగళవారం

నిజం - అబద్ధం

అన్నిసార్లూ నిజం
చెప్తారనేది అబద్ధం
కొన్నిసార్లైనా అబద్ధం
చెప్తారనేది నిజం
అన్నిసార్లూ నిజం
చెప్పరనేది నిజం
కొన్నిసార్లైనా అబద్ధం
చెప్పరనేది అబద్ధం.

"ఊరక" ఉండదు.

కవి 'తల' - "చలము"
అది ఊరక ఉండదు
'కవితల' చెలమ
అది "ఊరక" ఉండదు.


1, ఆగస్టు 2020, శనివారం

"భౌ"తిక

గుమిగూడిన
జనాన్ని చూస్తూ
"భౌ"తిక దూరాన్ని
గుర్తు చేస్తూ
శునకాలు -
"భౌభౌ" మని అరుస్తూ.