31, జులై 2020, శుక్రవారం

APPప్యాయత

నేడు మనుషుల్లో 
ఆప్యాయత కన్నా 
APPప్యాయత
ఎక్కువైంది. 

30, జులై 2020, గురువారం

రా 'దంచు'

"తప్పని" - సరిగా చదవక
చెప్పకు మాతృభాష రాదంచు
"తప్పనిసరి"గా చేశారు
ఇక వెనుదిరుగకురా - 'దంచు'

28, జులై 2020, మంగళవారం

"శారీ" రక శ్రమ

టెక్నాలజీ వల్ల తగ్గింది
కొందరికి "శారీరక" శ్రమ
ఫ్యాషన్ వల్ల తగ్గింది
కొందరికి "శారీ" రక శ్రమ.
26, జులై 2020, ఆదివారం

'ఒత్తు'గా

"మద్య" దూరాన్ని
తగ్గించు"కొనాలని"
"ఒత్తుగా" వారు
"మధ్య" దూరం పెంచాలని
"ఒత్తిడి" చేస్తూ వీరు


25, జులై 2020, శనివారం

మోహన్ని

'కరోనా' మన చేతులకు
నిగ్రహాన్ని నేర్పుతోంది
మొహంపై మోహాన్ని
వదులుకోమంటోంది.

23, జులై 2020, గురువారం

'మందు' కోసం

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని
మందుకోసం కొందరు
ప్రాణాలకోసం "మందు"
అరచేతిలో పెట్టు"కొని" కొందరు.

21, జులై 2020, మంగళవారం

'హాలాహలం'

అమృతం నిండుకుందని
చిలుకుతున్నారా పాలసముద్రాన్ని?
'హాలాహలం' నిండుతూ ఇల
వణుకుతోంది ఇలాఇలా.

20, జులై 2020, సోమవారం

"వంట" బట్టి

ఒంటబట్టించుకొని అందరం
ఒంటింపు ఆయుర్వేద సారం
"వంట" బట్టిన ఆహారం
ఒంటబట్టించుకుంటున్నాం.

18, జులై 2020, శనివారం

భాషాభి"MAN"లు.

ఇ"తరు"లు పచ్చి
భాషాభిమానులు
తెలుగువారు "పచ్చి" గొట్టిన
భాషాభి"మాను"లు
భాషాభి"MAN"లు.
17, జులై 2020, శుక్రవారం

మూసుకొని

ఇప్పటికి మానవుడికి
అర్థమయ్యిందిదే
ప్రకృతిముందు మనం
"మూసుకొని" ఉండాల్సిందే.


16, జులై 2020, గురువారం

అ(క)డుగుతున్నాం.

అంతటా నిండియున్న "వాణ్ణి"
ఉన్నాడా అని అడుగుతున్నాం
ఎక్కడుందో తెలియని "దాన్ని"
ఉందేమోనని కడుగుతున్నాం.


14, జులై 2020, మంగళవారం

శిశిరం "మోడ్"

ప్రపంచం మారింది మొత్తానికి
శిశిరం "మోడ్" లోకి
బ్రతుకులు "మోడు"లోకి
ఆశలు వసంతం "మూడ్" లోకి.


13, జులై 2020, సోమవారం

ఆహా! రమ్మే

నేడు అందరికి సరియైన
ఆహారమ్మే మందు
కాని కొందరికి
ఆహా! రమ్మే "మందు".

12, జులై 2020, ఆదివారం

అమ్మగా

పర స్త్రీని కొందరు
"అమ్మ"గా చూస్తారు
జాగ్రత్త, మరికొందరు
"అమ్మగా" చూస్తారు.

11, జులై 2020, శనివారం

"ప్లాస్టిక్" గోతిలో

తాను తీసిన
"ప్లాస్టిక్" గోతిలో తానే
చుట్ట"బడిపోతున్నాడు"
మనిషి - కరోన చావుతో.

10, జులై 2020, శుక్రవారం

కర్చీఫ్

ఛీప్ గా చూడకు - కర్చీఫ్
కరోనా నియంత్రణకు
"కట్టు"బడిన ఛీఫ్.

9, జులై 2020, గురువారం

సబ్బుచెక్కా, గుడ్డముక్కా

సబ్బుచెక్కా,గుడ్డముక్కా
కరము శుభ్రం, కాస్త దూరం
కాదేదీ ప్రాణ రక్షణకనర్హం.


7, జులై 2020, మంగళవారం

అలా వాటు

తగిన జాగ్రత్తలు మరి
చేసుకోకుంటే అలవాటు
కరోనా మహమ్మారి
వేసుకుంటుంది అలా వాటు.
6, జులై 2020, సోమవారం

నోర్ముయ్

పూర్తి ముఖం ఎవరిదైనా
కనబడితే ఒట్టు
వినబడకుండా పోయింది
"నోర్ముయ్" అనే తిట్టు.


5, జులై 2020, ఆదివారం

టీ..కా ఫీల్.

కరోనా! ఇప్పుడు నీకు
మాప్రాణాలే టీ, కాఫీల్
కాచుకో! త్వరలో నీప్రాణానికి
రుచిచూపిస్తాం టీకా ఫీల్.