28, జూన్ 2021, సోమవారం

కడుపులో "మంట"

 

కడుపులో "మంట" ఎక్కువై
బ్రతుకు "చితి"కి పోతున్నది
గుండె బాగా "బరు"వెక్కి
జీవితం "సమాధి" ఔతున్నది
కరోనా వల్ల "ఊపిరి సలపట్లేదు"
అని ఆక్రోశిస్తోంది స్మశానం.

27, జూన్ 2021, ఆదివారం

24, జూన్ 2021, గురువారం

"మో(ఓ)రల్"

 

"మోరల్" విలువలుంటే
"ఓరల్" మాట చాలు
"నోట్" నే పట్టించుకోనివాడు
"నోటిని" పట్టించుకుంటాడా?


23, జూన్ 2021, బుధవారం

ఖాళీ స్థలం

 

ఇంటికోసం పెద్ద ఖాళీ స్థలం
వెతుక్కునే వాళ్ళు కొందరు
ఇంటిలో చిన్న ఖాళీ స్థలం
వెతుక్కునేవాళ్ళు కొందరు.


19, జూన్ 2021, శనివారం

18, జూన్ 2021, శుక్రవారం

మూడు "ముళ్ళు"

 

వివాహమంటే
కాదు కేవలం
"మూడుముళ్ళు"
కాకుండా చూసుకో
మూడు "ముళ్ళు"


13, జూన్ 2021, ఆదివారం

"అదు"రాచారం

 

అంటుకుందేమోనని "కోవిడు"
చేతులు కడగటం
అంటిపెట్టుకుంటాడని "దేవుడు"
చేతులు మోడ్చటం
"అదు"రాచారం కాదు
అ "దురాచారం".


9, జూన్ 2021, బుధవారం

మద్దె"లోడు".

 

ఆట రక్తి కడుతుందా
ఆడ, లేక "మద్దెలోడు"
అంటే సరిపోతుందా
ఆడలేక, మద్దె"లోడు".


6, జూన్ 2021, ఆదివారం

తల "చెడు"

 "తలచెడు" కోరికలు
నెరవేరాలనుకో
తల "చెడు కోరికలు"
రాకుండా చూసుకో.


5, జూన్ 2021, శనివారం

మాస్క్ కట్టకు

 

"మాస్క్" ఆచారానికి
మాస్క్ కట్టకు
"దూరం" సంప్రదాయాన్ని
దూరం పెట్టకు.


4, జూన్ 2021, శుక్రవారం

"WAVE"విళ్ళు

 

కరోనా ర"క్కసి" కి
పెరుగుతున్నాయి "WAVE"విళ్ళు
కోరుతోంది మనుషుల
ప్రాణాల "చింత" కాయలు.

1, జూన్ 2021, మంగళవారం

పాపం

 


గంగలో మునకేస్తే
పోతుంది పాపం
శవాలేసినా గంగ
మౌనంగా సాగి
పోతుంది పాపం.