28, నవంబర్ 2022, సోమవారం

చెయ్యిస్తాడేమో

ఓటరూ! జాగ్రత్త
వేలిచ్చేవాడు
ఆపై చెయ్యిస్తాడేమో!
చేతులు జోడిచ్చేవాడు
రేపు కాలు జాడిస్తాడేమో!

27, నవంబర్ 2022, ఆదివారం

వెయ్యి

 మాకే ఓటు వెయ్యి

అంటూ నాయకుడు

మీకే, ఓటు వెయ్యి
అంటూ ఓటరు.

26, నవంబర్ 2022, శనివారం

చాటు


చాటుమాటలా
నలుగురికీ చాటు మాటలా
తెలుసుకొని మాట్లాడాలి.

21, నవంబర్ 2022, సోమవారం

పాట వింటే

 

పాట వింటే
మరల పాడుకునేట్లుండాలి
మరలి పడుకునేట్లుకాదు.


18, నవంబర్ 2022, శుక్రవారం

కనబడుటలేదు...

 

బాబూ! పెద నోటేశ్వర్రావ్!
నీకోసం "రెండు వేల" కళ్ళతో
ఎదురు చూస్తున్నాం
నిన్నేమీ అనం
త్వరలో వస్తావని
"ఆశిస్తున్నాం"17, నవంబర్ 2022, గురువారం

15, నవంబర్ 2022, మంగళవారం

బూమ'రాంగ్'

 

ఎవరినీ
తిట్టకు, రాంగ్
అనవసరంగా
తిట్టే బూతులు
బూమరాంగ్.

10, నవంబర్ 2022, గురువారం

కవరేజీ

  

నీతులు ప్రవచిస్తే
కవరులో వేసి మూత
బూతులు పలికేస్తే
కవరేజీల మోత.


7, నవంబర్ 2022, సోమవారం

వేలుమీద చుక్క

 

వేలు, చుక్క
ముట్టాయట
వేలు మీద చుక్క
వేయించుకొచ్చాడు
నిజాయితీగా ఓటరు.