30, మార్చి 2021, మంగళవారం

"లోనికి"

 

తన"లోనికి" చూడగలగటం
మహా యోగం
పక్కింటిలోనికి చూడాలనుకోవడం
మానసిక రోగం.


15, మార్చి 2021, సోమవారం

షా'కింగే'

 

కరోనా తో పోతే షాకింగే
కింగే అయినా ప్యాకింగే
తెలిసిందారా నీకు
దాన్ని నీదాకా రానీకు.12, మార్చి 2021, శుక్రవారం

11, మార్చి 2021, గురువారం

ఆకాశలింగాన్ని

 అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

శివానుగ్రహ ప్రాప్తిరస్తు.

ఆకాశలింగాన్ని దేవతలు
అభిషేకించినట్లున్నారు
పాలు, పెరుగు, వీబూది
మేఘాల్లా జారుతున్నాయ్.


10, మార్చి 2021, బుధవారం

9, మార్చి 2021, మంగళవారం

"ముంచుళ్ళు"

 

ఎన్నికల పండుగ "నాయకులకు"
ఓటరు "వినాయకులకు"
యధాశక్తి "నవ"రాత్రులు
ఉండ్రాళ్ళు, గుంజిళ్ళు
ఆపై "ముంచుళ్ళు"8, మార్చి 2021, సోమవారం

మిస్ "సై"ళ్ళు

 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మిస్ లు అ"న్నింటా"
మిస్ "అవ్వ"కుండా బయటా
దూస్ కెళ్తున్నారు
మిస్ "సై"ళ్ళులా.


5, మార్చి 2021, శుక్రవారం

నోరు "ఛీ"

 

మక్కువగా స్వీటులు
కుక్కకు - "నో" రుచి
ఎక్కువగా మాటలు
కక్కకు - నోరు "ఛీ"

"సారాయల్సు"

 

కిక్కురుమనక చూసే
సీరియల్సు - కొందరికి
కిక్కునిచ్చే "సారాయల్సు"

2, మార్చి 2021, మంగళవారం

"స్ట్రెయిన్"

 

కరోనా! నీవల్ల అయ్యాం
మేమెంతో స్ట్రెయిన్
ఇంక మేమేం అవ్వాలి
నీవు కూడా అయితే "స్ట్రెయిన్"

గూగులే నమః

 నేడు అందరికీ దారి "చూపు" గురువు "గూగుల్" అన్నీ గూగుల్ లోనే ఉన్నాయిష. గూగుల్ బ్రహ్మ గూగుల్ విష్ణుః గూగుల్ దేవో మహేశ్వరః గూగుల్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గూగులే నమః