23, మార్చి 2012, శుక్రవారం

అభి'నందన'

ఈ నందన వత్సరమున 

ఆ నంద నందనుడు 
అందించు గాక
అందరకు ఆనందములు

ఆ నంది వాహనుడు 
అందించు గాక 
అందరకు శుభాశీస్సులు 

రావోయి ' నందన '
నీకు  అభినందన

19, మార్చి 2012, సోమవారం

' కాల్చే' స్తారు

నీవు వాహనం 
నడిపే టప్పుడు తెలియక 
తెలిసిన వారు 
నీ ' సెల్ ' కు
పాపం  ' కాల్చే' స్తారు

నీవు తెలిసి కూడా 
తెలియని వాడిలా 
నడుపుతూ మాట్లాడితే
వెళతావు ' హెల్ '  కు  
నిన్ను ' కాల్చేస్తారు '.

11, మార్చి 2012, ఆదివారం

తెలుగు 'వాడి' ని.

ఏ దేశ మేగినా 
ఎందు కాలిడినా 
చెప్పరా గర్వంగా ఇలా 
'నేను తెలుగు వాడిని'


ఏ  పనిచేసినా  
ఎవరితో కలిసున్నా 
ఎప్పుడూ అవబోకు'సున్నా'
చూపించు  తెలుగు 'వాడి' ని.


4, మార్చి 2012, ఆదివారం

'ముక్కు' తాడు

బద్దకస్తు డైన వాడు 
ఏ పని చెప్పినా 
మూల్గు తాడు
ముక్కుతాడు

ఎద్దు చెప్పినట్లుగా 
పని చేయాలంటే 
వేయాలి దానికి 
ముక్కు  తాడు.